మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌ రెచ్చిపోయిన మరో నేపాలీ ముఠా …..

మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌ రెచ్చిపోయిన మరో నేపాలీ ముఠా

Advertisements

<p>హైదరాబాద్‌లో నేపాలీ ముఠాల నేరాలు రెచ్చిపోతున్నాయి&period; తాజాగా మరోసారి కలకలం సృష్టించింది మరో నేపాలీ గ్యాంగ్‌&period; మేడ్చల్‌ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూరు గల్ఫ్ ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్న డాక్టర్‌ దంపతుల ఇంట్లో ఓ ముఠా భారీ దోపిడీకి పాల్పడింది&period; డాక్టర్‌ విజయలక్ష్మి దంపతులను కట్టేసి ఇంట్లోని ఆభరణాలు&comma; నగదును దోచుకెళ్లారు&period; ఇంట్లో పని చేసేవారే పథకం ప్రకారం ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు&period; ఈ ఘటనలో దుండగులు 60 తులాల బంగారం&comma; వెండి వస్తువులు&comma; 30 వేల నగదును దోచుకెళ్లారు&period;<&sol;p>&NewLine;<p>డాక్టర్‌ విజయలక్ష్మి దంపతులు13 రోజుల క్రితమే నేపాల్‌కు చెందిన దంపతులను పనిలో పెట్టుకున్నారు&period; పనిమనిషి పుట్టినరోజు అని చెప్పి&comma; కేక్ కటింగ్ ఏర్పాటు చేశారు&period; ఈ వేడుకకు వారి స్నేహితులుగా మరో ఐదుగురిని ఇంటికి పిలిచారు&period; డాక్టర్‌ దంపతులు భోజనం చేస్తున్న సమయంలో ముఠా సభ్యులు ఒక్కసారిగా వారిపై దాడి చేసి&comma; తాళ్లతో కట్టేశారు&period; మీకు కావాల్సింది తీసుకెళ్లండి&comma; మమ్మల్ని చంపకండి అని బాధితులు వేడుకున్నా వినకుండా&comma; వారికి మత్తుమందు ఇచ్చి ఓ గదిలో బంధించారు&period; అనంతరం ఇంట్లో ఉన్న బంగారం&comma; వెండి&comma; నగదును దోచుకుని&comma; సాక్ష్యాలు దొరక్కుండా సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేసి పరారయ్యారు&period; నిన్న మధ్యాహ్నం స్పృహలోకి వచ్చిన దంపతులు కిటికీ నుంచి కేకలు వేయడంతో&comma; చుట్టుపక్కల వారు వచ్చి వారిని రక్షించి పోలీసులకు సమాచారం అందించారు&period; మల్కాజ్‌గిరి డీసీపీ సుమతి ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు&period; పోలీసులు కేసు నమోదు చేసి&comma; నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నీట్ లీక్ దర్యాప్తులో వెలుగులోకి సంచలన విషయాలు..

“అగ్లీ స్టోరీ” చిత్రంతో నందుకు మంచి బ్రేక్ వస్తుంది..

తెనాలి శిల్పశాల ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి..