హీరా గ్రూప్ MD నౌహీరా షేక్ అరెస్ట్..

హీరా గ్రూప్ MD నౌహీరా షేక్ అరెస్ట్

Advertisements

<p>హీరాగోల్డ్ కుంభకోణం కేసులో ప్రధాన నిందితురాలు నౌహీరా షేక్‌ను ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు ఈడీ అధికారులు&period; గత కొద్దిరోజులుగా దర్యాప్తు సంస్థల కళ్లుగప్పి అజ్ఞాతంలో ఉంటున్న ఆమెను హర్యానాలోని గుర్గావ్‌లో అదుపులోకి తీసుకొని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు&period; సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేసిన తర్వాత చట్టానికి దొరక్కుండా పరారయ్యారు నౌహీరా షేక్&period; గుర్గావ్‌లోని ఓ అద్దె నివాసంలో ఆమె నకిలీ పేరుతో&comma; ఫోర్జరీ చేసిన ఆధార్ కార్డు&comma; ఇతర నకిలీ గుర్తింపు పత్రాలను ఉపయోగించి మారువేషంలో తలదాచుకున్నట్లుగా దర్యాప్తులో తేలింది&period; హ్యూమన్&comma; టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా నిఘా పెట్టిన ఈడీ హైదరాబాద్ జోనల్ బృందం&period;&period; ఇవాళ ఉదయం ఆమె ఉన్న లొకేషన్‌ను గుర్తించి అదుపులోకి తీసుకుంది&period; గుర్గావ్‌లో అరెస్ట్ చేసిన అనంతరం నౌహీరా షేక్‌ను ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలిస్తున్నారు&period; ఇక్కడికి తీసుకువచ్చిన తర్వాత బేగంపేట కోర్టు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టనున్నారు&period; న్యాయస్థానం ఆదేశాల మేరకు వైద్య పరీక్షల అనంతరం ఆమెను జైలుకు తరలించనున్నారు&period; కాగా&comma; నకిలీ గుర్తింపు పత్రాలను ఉపయోగించినందుకు గానూ గుర్గావ్ పోలీసుల చేత ఆమెపై విడిగా మరో ఫోర్జరీ కేసు నమోదు చేయించేందుకు కూడా ఈడీ సిద్ధమవుతోంది&period;<&sol;p>&NewLine;<p>హీరా గ్రూప్ సంస్థల పేరిట ఏడాదికి 36 శాతం చొప్పున భారీ లాభాలు ఇస్తామని నమ్మించి దాదాపు 5 వేల 978 కోట్లు వసూలు చేసి మోసగించినట్లు నౌహీరా షేక్‌పై ఆరోపణలు ఉన్నాయి&period; ఇప్పటికే ఈడీ ఈ కేసులోPMLA కింద హీరా గ్రూప్‌కు చెందిన 400 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఆస్తులను జప్తు చేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వెనుకబడి తరగతుల్లోని ధనవంతులు రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది..

సంక్షోభంలో 130 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన సింగరేణి..

యూపీలో ఏపీ పర్యాటకుల బస్సుకు ప్రమాదం..