యూపీలో ఏపీ పర్యాటకుల బస్సుకు ప్రమాదం..

యూపీలో ఏపీ పర్యాటకుల బస్సుకు ప్రమాదం

Advertisements

<p>ఉత్తరప్రదేశ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పర్యాటకులు ప్రయాణిస్తున్న బస్సుకు ప్రమాదం చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి&period; ఏపీలోని నరసరావుపేట ప్రాంతానికి చెందిన యాత్రికులతో వెళ్తున్న బస్సు నైమిశారణ్యం నుంచి అయోధ్యకు వెళ్తుండగా మార్గమధ్యంలో అదుపుతప్పి ప్రమాదానికి గురైంది&period; ఈ ప్రమాదంలో డ్రైవర్‌&comma; పర్యాటక గైడ్‌ మృతి చెందగా&comma; పలువురికి స్వల్ప గాయాలయ్యాయి&period; లక్నో&comma; అయోధ్య మీదుగా నేపాల్ వెళ్తుండగా ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు&period; గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన భక్తులు ప్రత్యేక పర్యాటక యాత్రలో భాగంగా ఉత్తర భారత పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు&period; ఈ క్రమంలో నైమిశారణ్యం దర్శనం ముగించుకుని అయోధ్య వైపు బయలుదేరిన బస్సు మార్గమధ్యంలో ప్రమాదానికి గురైంది&period; ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు&comma; పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు&period;బస్సులో ఉన్న ప్రయాణికులందరికీ స్వల్ప గాయాలు మాత్రమే కావడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు&period; కొందరికి చేతులు&comma; కాళ్లకు గాయాలు కాగా&comma; మరికొందరు భయాందోళనలకు గురయ్యారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వెనుకబడి తరగతుల్లోని ధనవంతులు రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది..

సంక్షోభంలో 130 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన సింగరేణి..

సింగపూర్‌లో మళ్లీ పెరుగుతున్న కొవిడ్ కేసులు..