కోయంబత్తూరులోని తొండముత్తూరు ప్రాంతంలో సంచలన ఘటన..

కోయంబత్తూరులోని తొండముత్తూరు ప్రాంతంలో సంచలన ఘటన

Advertisements

<p>కోయంబత్తూరులోని తొండముత్తూరు ప్రాంతంలో ప్రేమ వ్యవహారం వివాదాస్పదంగా మారి దారుణ ఘటన చోటుచేసుకుంది&period; బ్రేకప్ చెప్పిందన్న కోపంతో ఓ యువతి ఇంటిపై ఆమె మాజీ ప్రియుడు పెట్రోల్ బాంబులతో దాడి చేయడం కలకలం రేపింది&period; ఈ ఘటనలో ఇంట్లో చదువుకుంటున్న యువతి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది&period; ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి&period;<&sol;p>&NewLine;<p>తొండముత్తూరు సమీపంలోని కలిక్కనాయకన్‌పాళయం ప్రాంతంలో బాధిత కుటుంబం నివాసం ఉంటోంది&period; సీసీటీవీ ఫుటేజీలో ఇంటి ముందు ప్రశాంత వాతావరణం కనిపించగా&comma; కొద్దిసేపటికే ఇద్దరు వ్యక్తులు బైక్‌పై అక్కడికి చేరుకున్నారు&period; అనంతరం పెట్రోల్‌తో నింపిన బీర్&comma; మద్యం సీసాలను ఇంటిపైకి విసిరారు&period; దీంతో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగి ఇంటి ప్రవేశద్వారం&comma; బయట పార్క్ చేసిన ఎర్రటి స్కూటర్ మంటల్లో చిక్కుకున్నాయి&period; మంటల కారణంగా దట్టమైన పొగ వ్యాపించగా&comma; సీసీటీవీ కెమెరా కూడా స్వల్పంగా కదిలినట్లు దృశ్యాల్లో కనిపించింది&period; అదృష్టవశాత్తూ మంటలు ఇంటి బయటకే పరిమితం కావడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు&period;<&sol;p>&NewLine;<p>ఈ ఘటనలో ప్రధాన నిందితుడిని కార్తీక్ అలియాస్ మరియప్పన్గా గుర్తించారు&period; బాధితురాలి తండ్రి&comma; తాలియూర్ టౌన్ పంచాయతీ ఉద్యోగి సుందరమూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు&period; కోయంబత్తూరులోని ఓ కళాశాలలో చదువుతున్న సమయంలో యువతికి కార్తీక్‌తో పరిచయం ఏర్పడి&comma; అది ప్రేమగా మారింది&period; అయితే అతడిపై హత్య&comma; దోపిడీ సహా తమిళనాడులోని పలు పోలీస్ స్టేషన్లలో 31కు పైగా క్రిమినల్ కేసులు ఉన్నట్లు యువతికి తెలిసింది&period; దీంతో ఆమె అతనికి బ్రేకప్ చెప్పింది&period; అప్పటి నుంచి తిరిగి సంబంధం కొనసాగించాలని ఒత్తిడి చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నాడని సమాచారం&period; ఆదివారం సాయంత్రం కార్తీక్ తన అనుచరులతో కలిసి రెండు బైక్‌లపై యువతి ఇంటికి వచ్చి&comma; ముందుగా యువతి తండ్రిని బెదిరించిన అనంతరం పెట్రోల్ బాంబులతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు&period; కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.