హైదరాబాద్‌లోని గండిపేట భూకబ్జా యత్నం కేసులో దర్యాప్తు..

హైదరాబాద్‌లోని గండిపేట భూకబ్జా యత్నం కేసులో దర్యాప్తు

Advertisements

<p>నకిలీ జీఓలు&comma; ఫోర్జరీ పత్రాలతో కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని విక్రయించేందుకు యత్నించిన అంతర్రాష్ట్ర భూ దందా ముఠాను పోలీసులు ఛేదించారు&period; పోలీసులకు తహసీల్దార్ ఫిర్యాదు చేయడంతో భూదందా గుట్టు వెలుగులోకి వచ్చింది&period; గండిపేట పరిధిలోని సర్వే నెంబర్ 18లో గల ప్రభుత్వ పోరంబోకు భూమిపై నిమ్మల కుటుంబానికి చెందిన కొందరు వ్యక్తులు చట్టబద్ధమైన హక్కులు లేకపోయినా తమదేనంటూ క్లెయిమ్ చేస్తూ వచ్చారు&period; ఈ క్రమంలో సదరు భూమి తమదేనంటూ వారు హైకోర్టులో పిటిషన్లు కూడా దాఖలు చేశారు&period; అయితే&comma; విచారణ అనంతరం అక్టోబర్ 2025లో వీరి పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది&period;కోర్టులో చుక్కెదురైనప్పటికీ&comma; నిందితులు వెనక్కి తగ్గకుండా ప్రభుత్వం ఈ భూమిని తమకు క్రమబద్ధీకరించిందంటూ ఏకంగా ఐదు నకిలీ జీఓలను &lpar;Fake GOs&rpar; సృష్టించారు&period; ఈ ఫేక్ జీఓలను వాట్సాప్&comma; ఇతర సోషల్ మీడియా వేదికల్లో వైరల్ చేస్తూ ప్రచారం మొదలుపెట్టారు&period; దీనిపై సమాచారం అందుకున్న స్థానిక తహసీల్దార్ నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ భారీ భూ మోసం వెలుగులోకి వచ్చింది&period;<&sol;p>&NewLine;<p>&lpar;&rpar;హైదరాబాద్‌లో గండిపేట భూకబ్జా యత్నం కేసు దర్యాప్తు వేగవంతమైంది&period; నకిలీ పత్రాలు&comma; నకిలీ జీవోలను సృష్టించి ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు&period; ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు&period;&period; పరారీలో ఉన్న కీలక నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు&period;నకిలీ పత్రాలు&comma; నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు సృష్టించి భూమిపై హక్కులు పొందేందుకు ప్రయత్నించారన్న కోణంలో విచారణ కొనసాగుతోంది&period;ఈ వ్యవహారానికి సంబంధించిన కీలక డాక్యుమెంట్లు&comma; ఇతర ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది&period;<br &sol;>&NewLine;కేసులో ఇప్పటికే నిమ్మల రాజేష్&comma; వేణుగోపాల్&comma; సాయికిరణ్‌లను పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు&period;మరోవైపు కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు&comma; బొల్లా రమేష్&comma; సునీల్&comma; రాధాకృష్ణ పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు&period;వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టగా&comma; త్వరలోనే మరిన్ని అరెస్టులు జరిగే అవకాశముందని తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.