తిరుపతి జిల్లాలో మట్కాపై పోలీసుల ఉక్కుపాదం.

తిరుపతి జిల్లాలో మట్కాపై పోలీసుల ఉక్కుపాదం

Advertisements

<p>తిరుపతి జిల్లాలో మట్కాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు&period; గత 10 ఏళ్లుగా శ్రీకాళహస్తి&comma; తిరుపతి&comma; నగరి&comma; తమిళనాడు సరిహద్దుల్లో మట్కా ఆడిస్తూ వ్యవస్థలను మేనేజ్ చేస్తూ తప్పించుకు తిరుగుతున్న కింగ్‌పిన్ పద్మనాభంను&period;&period;ఎట్టకేలకు తిరుపతి పోలీసులు అరెస్టు చేశారు&period; అతనికి సహకరించిన శ్రీకాళహస్తికి చెందిన ఇద్దరు సీఐలు&comma; నలుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయగా&comma; డీఎస్పీకి చార్జ్ మెమో జారీ చేశారు&period;<&sol;p>&NewLine;<p>తమిళనాడులోని పళ్లిపట్టుకు చెందిన పద్మనాభం అలియాస్‌ కుప్పయ్య 10 ఏళ్ల కిందట శ్రీకాళహస్తికి వచ్చాడు&period; కొందరితో కలిసి ముఠాగా ఏర్పాటై మట్కా&comma; పేకాట మొదలు పెట్టాడు&period; దీనికి పోలీసుల అండ&period;&period; ఒకరిద్దరు నేతల మద్దతూ కూడగట్టుకున్నాడు&period; వైసీపీ హయాంలో ఓ నేతతో కలిసి తన మట్కా సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరించాడు&period; మట్కాను అరికట్టాల్సిన పోలీసుల్లో కొందరు అధికారుల నుంచి సిబ్బంది వరకు అండగా నిలబడడంతో అతడికి ఎదురే లేకుండా పోయింది&period; శ్రీకాళహస్తి కేంద్రంగా దాదాపు 10 ఏళ్లుగా మట్కా నిర్వహిస్తున్నాడు పద్మనాభం&period; ఈ వ్యవహారం గురించి ఎప్పటి నుంచో అందరికీ తెలిసినా&comma; పట్టించుకోలేదు&period; మట్కాపై చర్యలు తీసుకోవాలన్న కూటమి ప్రభుత్వం ఆదేశాలతో ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ&period;&period; ప్రత్యేకంగా దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేసి రహస్యంగా విచారణ చేపట్టారు&period; ఈ క్రమంలో ప్రత్యేక పోలీసు బృందం మట్కా కింగ్‌పిన్‌ పద్మనాభంను అరెస్ట్‌ చేశారు&period; అతడిని విచారించగా సంచలన విషయాలు వెలుగుచూశాయి&period; మట్కా నిర్వహణలో కొందరు పోలీసు అధికారులు&comma; సిబ్బంది పాత్రపై ఆరోపణలు వినిపించాయి&period; దీనిపై నిర్దారణకు ఎస్పీ సుబ్బరాయుడు శాఖాపరంగా అంతర్గత విచారణ చేయించారు&period; ఈ క్రమంలో మట్కా కింగ్‌పిన్‌కు పలువురు పోలీసులు సహకరించినట్లు నిర్ధారణ అయింది&period; దీంతో ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు&period; శ్రీకాళహస్తికి చెందిన ఇద్దరు సీఐలు&comma; నలుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేశారు&period; శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తికి చార్జ్‌ మెమో జారీ చేశారు&period; గత పదేళ్లకాలంలో జిల్లాలో పనిచేసిన పలువురు పోలీసు అధికారులతో&period;&period;పట్టుబడిన కింగ్‌పిన్‌ పద్మనాభంకు మంచి సంబంధాలున్నట్టు తెలుస్తోంది&period; అతడిని అరెస్ట్‌ చేయడం జిల్లాలోని మట్కా నెట్‌వర్క్‌లో మిగిలిన బుకీలు&comma; రైటర్లలో వణుకు పుట్టించినట్లు చర్చ సాగుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.