హైదరాబాద్‍లో కాల్పుల కలకలం.

హైదరాబాద్‍లో కాల్పుల కలకలం

Advertisements

<p>నగరంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది&period; అనుమానం నేపథ్యంలో ఓ భర్త తన భార్యను తుపాకితో కాల్చి చంపాడు&period; మాట్లాడుకుందాం అని పిలిచి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు&period; పోలీసులు తెలిపిన వివరాల మేరకు&period;&period; మల్కాజ్‌గిరికి చెందిన అరుణ్ అనే వ్యక్తికి పదేళ్ల క్రితం ఓ మహిళ‌తో పెళ్లైంది&period; వివాహం అనంతరం భార్యతో విభేదాలు తలెత్తాయి&period; అరుణ్ వేధింపులు తట్టుకోలేక ఆమె దూరంగా ఉంటోంది&period; ఈ నేపథ్యంలో భార్య చెల్లెలు ఉషారాణితో అరుణ్ సహజీవనం మొదలుపెట్టాడు&period; ఐదు సంవత్సరాల క్రితం యాదగిరిగుట్టలో ఉషారాణిని వివాహం చేసుకున్నాడు&period; అరుణ్&comma; ఉషారాణి మల్కాజ్‌గిరిలోని మారుతి నగర్‌లో ఇళ్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు&period; ఉషారాణి మరొకరితో సన్నిహితంగా ఉంటోందని&comma; చాటింగ్ చేస్తోందని అరుణ్ అనుమానం పెంచుకున్నాడు&period; ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య గత కొన్ని నెలల నుంచి గొడవలు జరుగుతున్నాయి&period; గొడవల కారణంగా ఉషారాణి భర్తకు దూరంగా ఉంటోంది&period; దీంతో భార్య మీద పగ పెంచుకున్న అరుణ్ ఆమెను చంపాలని నిశ్చయించుకున్నాడు&period; ఉషారాణిని మాట్లాడుకుందాం అని పిలిచి తుపాకితో కాల్చాడు&period; బుల్లెట్ల కారణంగా తీవ్రంగా గాయపడ్డ ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది&period; సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు&period; మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు&period; కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు&period; ఉషారాణిని చంపడానికి అరుణ్ తుపాకి కొనుగోలు చేసినట్లుగా అనుమానిస్తున్నారు&period; తుపాకి ఎవరిచ్చారు&quest; ఎక్కడి నుంచి వచ్చింది&quest; అన్న అంశాలపై ఆరా తీస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.