పోలవరం జిల్లా చింతూరు పరిధిలో భారీ గంజాయి పట్టివేత.

పోలవరం జిల్లా చింతూరు పరిధిలో భారీ గంజాయి పట్టివేత

Advertisements

<p>పోలవరం జిల్లా చింతూరు పరిధిలో భారీగా గంజాయి పట్టుబడిన ఘటన కలకలం రేపుతోంది&period; ఎటపాక మండలం పురుషోత్తంపట్నం గ్రామ శివారు ప్రాంతంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడింది&period;ఒడిశా రాష్ట్రం మల్కనగిరి జిల్లా నుంచి తెలంగాణకు టాటా మాంజా కారులో తరలిస్తున్న 116 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు&period; దీని విలువ సుమారు 5 లక్షల 60 వేల రూపాయలుగా అంచనా వేస్తున్నారు&period;ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా&comma; మరో ముగ్గురు పరారయ్యారు&period; వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి&period; పైలట్‌గా వ్యవహరించిన హోండా యూనికార్న్ ద్విచక్ర వాహనంతో పాటు టాటా మాంజా కారును పోలీసులు సీజ్ చేశారు&period; నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఎటపాక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వి&period; కృష్ణ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.