కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.

Advertisements

<p>కాకినాడ జిల్లాలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది&period; ప్రేమ వ్యవహారం నేపథ్యంలో తమ కుమార్తెను యువకుడు ఉరివేసి హత్య చేశాడని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు&period; అయితే దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు&period; ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టగా&period;&period; న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని మార్చురీ నుంచి తీసుకెళ్లబోమంటూ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు&period;సమాచారం అందుకున్న వన్‌టౌన్ సీఐ నాగదుర్గారావు&comma; ఎస్సైతో పాటు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు&period; అనుమానితుడిగా భావిస్తున్న సందీప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు&period;<br &sol;>&NewLine;ఇదిలా ఉంటే&comma; గత ఏడు నెలలుగా లాఫి&comma; సందీప్ మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగుతోందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు&period; ఇద్దరూ మైనర్లు కావడంతో గతంలో ఇంద్రపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని&comma; అప్పట్లో వారికి కౌన్సెలింగ్ నిర్వహించి పంపించారని తల్లిదండ్రులు తెలిపారు&period;అయితే తమ కుమార్తెను కావాలనే హత్య చేసి&comma; దానిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు&period; నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.