విజయవాడలో కంటైనర్‍ను ఢీకొన్న గంజాయి తరలిస్తున్న కారు.

విజయవాడలో కంటైనర్‍ను ఢీకొన్న గంజాయి తరలిస్తున్న కారు

Advertisements

<p>విజయవాడ బైపాస్ రోడ్డులో గంజాయి తరలిస్తున్న కారు కంటైనర్‌ను ఢీకొట్టడం వల్ల ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది&period; విజయవాడ పరిధిలోని నున్న పోలీస్ స్టేషన్ పరిమితుల్లో గల బైపాస్ రోడ్డుపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది&period;<br &sol;>&NewLine;తమిళనాడుకు చెందిన నలుగురు యువకులు ఒడిశా-ఆంధ్రా సరిహద్దులో 25 కిలోల గంజాయిని కొనుగోలు చేసి కారులో తరలిస్తున్నారు&period;కారు నడుపుతున్న వ్యక్తి గంజాయి మత్తులో ఉండటంతో&comma; నున్న సమీపంలో కారు నియంత్రణ కోల్పోయి ముందు వెళ్తున్న కంటైనర్‌ను బలంగా ఢీకొట్టింది&period; ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది&period; కారులో ఉన్న నలుగురు యువకులకు తీవ్ర గాయాలవగా&comma; స్థానికుల సహాయంతో వారిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు&period; వీరిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు&period; చికిత్స పొందుతున్న సమయంలో వారు గంజాయి మత్తులో ఉండటాన్ని పోలీసులు గమనించారు&period; ప్రమాద స్థలంలోని కారును తనిఖీ చేయగా 25 కిలోల గంజాయి ప్యాకెట్లు లభ్యమవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు&period; ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిందితుల్లో ఒకరు పోలీసుల కళ్లు గప్పి అక్కడి నుంచి పరారయ్యాడు&period; ఈ ఘటనపై నున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని&comma; పరారైన నిందితుడి కోసం గాలిస్తూ తదుపరి దర్యాప్తును ముమ్మరం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.