ఛత్తీస్‌గఢ్‌ గుండర్‌దేహి గ్రామంలో దారుణం.

ఛత్తీస్‌గఢ్‌ గుండర్‌దేహి గ్రామంలో దారుణం

Advertisements

<p>ఛత్తీస్‌గఢ్‌లో సినిమాను తలపించేలా హైడ్రామా నడిచింది&period; మద్యం మత్తులో ఉన్న ఓ ట్రక్కు డ్రైవర్&comma; 11 ఏళ్ల బాలికను ఢీకొట్టడంతో ఆమె మృతి చెందింది&period; ఐతే ఆ బాలికను ఢీకొట్టిన డ్రైవర్‌ అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించాడు&period; పోలీసులు దాదాపు 60 కిలోమీటర్ల దూరం&period;&period;రెండు గంటల పాటు ఛేజింగ్‌ చేసి మరీ చివరకు అతడిని అరెస్ట్ చేశారు&period; రాజ్‌నంద్‌గావ్-మాన్‌పూర్ రహదారిపై ఉన్న గుండర్‌దేహి గ్రామంలో జరిగింది ఈ దారుణ ఘటన&period; వేగంగా వెళుతున్న ఓ ట్రక్కు పూనమ్ అనే 11 ఏళ్ల బాలికను ఢీకొట్టింది&period; ఈ ప్రమాదంలో బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది&period; అయితే&comma; డ్రైవర్ ట్రక్కును ఆపకుండా&comma; పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు మోహ్లా వైపు వేగంగా పారిపోయాడు&period;<&sol;p>&NewLine;<p>విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు&period; మోహ్లా పోలీస్ స్టేషన్ వెలుపల బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ట్రక్కును ఆపేందుకు ప్రయత్నించారు&period; అయితే&comma; డ్రైవర్ అక్కడే ఆగి ఉన్న మరో ట్రక్కును వెనుక నుంచి ఢీకొట్టి&comma; పోలీసు బ్యారికేడ్లను బద్దలు కొట్టుకుని ముందుకు దూసుకెళ్లాడు&period; దీంతో పోలీసులు మాన్‌పూర్‌లోని సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ కార్యాలయం వద్ద మరోసారి బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు&period; డ్రైవర్ వాటిని కూడా ఢీకొట్టి&comma; బారికేడ్లలోని కొన్ని భాగాలను ఈడ్చుకుంటూ వెళ్లిపోయాడు&period; ఈ సమయంలో పోలీసులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు&period;<&sol;p>&NewLine;<p>దాదాపు 60 కిలోమీటర్ల ఉత్కంఠభరితమైన ఛేజింగ్ తర్వాత మహారాష్ట్ర సరిహద్దుకు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోర్కోట్టి గ్రామ సమీపంలో ట్రక్కు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి ఆగింది&period; ఈ ప్రమాదంలో గాయపడిన డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు&period; అతడు మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించి&comma; చికిత్స కోసం మాన్‌పూర్ ఆసుపత్రికి తరలించారు&period; మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ ఉన్న ఆ ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు&period; ఈ ప్రమాదంతో ఆగ్రహానికి గురైన గుండర్‌దేహి గ్రామస్థులు&comma; బాలిక మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి రెండు గంటల పాటు రాకపోకలను అడ్డుకున్నారు&period; నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీనియర్ పోలీస్ అధికారులు హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు&period; పోస్టుమార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.