అన్నమయ్య జిల్లాలో అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్.

అన్నమయ్య జిల్లాలో అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్

Advertisements

<p>అన్నమయ్య జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు మరోసారి ఉక్కుపాదం మోపారు&period; రాయచోటిలోని పాత ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి కేసు వివరాలను వెల్లడించారు&period;ఈ నెల 7à°¨ రామాపురం మండలంలో గంజాయి తరలిస్తున్న గాలివీడు మండలానికి చెందిన కమలాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు&period; అతని విచారణలో అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టు రట్టయిందని ఎస్పీ తెలిపారు&period;దీంతో బీహార్‌కు చెందిన ప్రకాష్&comma; విశాఖపట్నానికి చెందిన బోడన్నా&comma; రాయచోటికి చెందిన ఖాదర్‌బాషాలను రామాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు&period;ఒడిశా నుంచి అరకు మీదుగా గంజాయిని తీసుకొచ్చి అన్నమయ్య జిల్లాతో పాటు బెంగళూరులో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని ఎస్పీ వెల్లడించారు&period;<br &sol;>&NewLine;పోలీసుల కళ్లుగప్పేందుకు పోర్టర్ యాప్‌ను వినియోగిస్తూ కొనుగోలుదారులకు సమాచారం చేరవేసి గుట్టుచప్పుడు కాకుండా గంజాయి విక్రయాలు నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో బయటపడిందన్నారు&period; ఈ వ్యవహారంపై కర్ణాటక పోలీసుల నుంచి కూడా సమాచారం అందినట్లు తెలిపారు&period;నిందితుల వద్ద నుంచి సుమారు రూ&period;60 లక్షల విలువైన 6 కిలోల గంజాయి&comma; ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు&period;అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన లక్కిరెడ్డిపల్లె సర్కిల్ పోలీసు అధికారులు&comma; సిబ్బందిని నగదు బహుమతులతో అభినందించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నీట్ పేపర్ లీక్పై పోరాడుతున్న సోనమ్ వాంగ్చుక్.

పాకిస్తాన్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.

విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటు బోల్తా.