మాదాపూర్‌లో భాస్కర్ దారుణ హత్య.

మాదాపూర్‌లో భాస్కర్ దారుణ హత్య

Advertisements

<p>వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి లో పరువు హత్య తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది&period; బాధితుడి బంధువులు ఆగ్రహంతో ఉప్పరపల్లిలో ఉద్రిక్తత నెలకొంది&period; ఉప్పరపల్లి గ్రామానికి చెందిన సినపెల్లి భాస్కర్&comma; నిఖిత కొంతకాలంగా ప్రేమించుకున్నారు&period; ఇరువురు వేర్వేరు సామాజిక వర్గాలకు చెందినవారు కావటంతో మూడేళ్ల క్రితం నికితకు వేరే యువకుడితో వివాహం జరిపించారు&period; నిఖిత కి పెళ్లి ఇష్టం లేకపోవడం తో ఇటీవల విడాకులు తీసుకుంది&period; అయితే తన కూతురి కాపురం కూలిపోవడానికి భాస్కరే కారణమని కక్ష పెంచుకున్నాడు నికిత తండ్రి&period; హైదరాబాద్ మాదాపూర్ హాస్టల్ లో ఉంటున్న భాస్కర్ ను నికిత తండ్రి&comma; మరికొందరుకలిసి దాడి చేసి దారుణంగా హతమార్చారు&period; భాస్కర్ దారుణ హత్యకు గురయ్యాడనే వార్త ఉప్పరపల్లి గ్రామానికి చేరడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది&period; ఆగ్రహంతో ఊగిపోయిన భాస్కర్ బంధువులు&comma; దళిత సంఘాల నాయకులు ఉప్పరపల్లి లో రోడ్డు వద్ద ధర్నాకు దిగారు&period; పోలీసులు అవాంఛనీయ ఘటనలు ఏవీ జరగకుండా&comma; శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా గ్రామంలో భారీగా బలగాలను మోహరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నీట్ పేపర్ లీక్పై పోరాడుతున్న సోనమ్ వాంగ్చుక్.

పాకిస్తాన్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.

విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటు బోల్తా.