ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో…

Advertisements

<p>ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి తలకు తీవ్ర గాయమై ఆస్పత్రిలో చికిత్స పొంతుతూ మృతి చెందిన సంఘటన లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది&period;లాలాపేటలోని ఇంద్రనగర్ ప్రాంతానికి చెందిన బాలకృష్ణ యాదవ్ అనే వ్యక్తి గతంలో ఆదే ప్రాంతానికి చెందిన దిలీప్ ముదిరాజ్ అనే -వ్యక్తికి కొంత డబ్బు అప్పుగా ఇచ్చాడు&period; తాజాగా దిలీప్ కు ఫోన్ చేసి తాను ఇచ్చిన డబ్బులు తిరిగివ్వమంటూ బాలకృష్ణ అడిగాడు&comma; మద్యం మత్తులో ఉన్న దిలీప్ అతడితో దురుసుగా మాట్లాడుతూ డబ్బులు తిరిగివ్వనని తేల్చి చెప్పాడు&period; దీంతో ఇరువురి మధ్య ఫోన్లో వాగ్వాదం జరిగింది&period; దీంతో రాత్రి 10 గంటల సమయంలో దిలీప్ తన సోదరుడు సాయికుమార్ తో కలిసి బాలకృష్ణ ఇంటికి వెళ్లి డోర్ కొట్టారు&period; అతడు తలుపు తీసిన వెంటనే వీరి వెంట తెచ్చుకున్న కారంపొడి అతడి కళ్లలో కొట్టి&comma; ఒంటిపై పెట్రోల్ పోశారు&period; నిప్పంటించే ప్రయత్నం చేస్తుండగా స్థానికంగా ఉన్న కొందరు వ్యక్తులు వచ్చి వారిని అడ్డుకొని దేహశుద్ది చేసి పంపించారు&period; అనంతరం&comma; కొద్ది సేపటికి ఇంటికి వచ్చిన బాలకృష్ణ కుమారుడు ఫణీంద్ర తన తండ్రిపై జరిగిన హత్యాయత్నం గురించి తెలుసుకున్నాడు&period; వెంటనే కొపంతో కర్ర పట్టుకొని ఫణీంద్ర&comma; అతని బంధువైన రాకేష్ యాదవ్ కలిసి దిలీప్ ఇంటికి ఆవేశంగా పరుగులు తీశారు&period; మార్గం మధ్యలో దిలీప్&comma; సాయికుమార్లను చూసిన వెంటనే ఫణీంద్ర&comma; రాకేష్ వారిపై దాడికి దిగారు&period; ఈ క్రమంలో ఫణీంద్ర తన చేతిలో ఉన్న కర్రతో దిలీప్ తలపై విచక్షణా రహితంగా కొట్టడంతో రక్తశ్రావమై అక్కడికక్కడే కుప్పకూలాడు&period; సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దిలీప్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు&period; కాగా&comma; దిలీప్ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు&period; మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు ఫణీంద్ర&comma; రాకేష్ యాదవ్ పై హత్య కేసు నమోదు చేశారు&period; అదే విధంగా బాలకృష్ణపై పెట్రోల్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేసిన సాయికుమార్ పై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం..

మహబూబాబాద్ లో అన్నదాతల ఆక్రందన

వానాకాలం సాగుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు.