సంగారెడ్డి జిల్లా వెలిమల సేల్ స్టీల్ కంపెనీ నుంచి పెద్ద ట్రాలీ లారీల్లో లోడింగ్ చేసుకుని మధ్యలో ఒక దగ్గర ఆపి కొంత అన్ లోడ్ చేసి డబ్బులు దండుకుంటున్న నలుగురు లారీ డ్రైవర్లను బీడీఎల్ భానూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సంగారెడ్డి జిల్లా బీడీఎల్ బానూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న అర్థరాత్రి ఐరన్ రాడ్ లోడ్ తో వెళ్తూ మధ్యలో డంపింగ్ చేస్తున్న నాలుగు లారీలను పట్టుకుని సీజ్ చేశారు. సీఐ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ వెలిమల SAIL స్టీల్ కంపెనీ నుంచి అపర్ణ, కల్పతరువు కన్ స్ట్రక్షన్ కు నాలుగు ఐరన్ లోడ్ లారీలు వెళ్లాల్సి ఉండగా వెలిమల శివారులోని ఒక సిమెంట్ బ్రిక్స్ కంపెనీ లో అర్థరాత్రి ఒక్కొక్క ట్రాలీ నుండి సుమారు 300 నుండి 500 కిలోల రాడ్స్ ను లారీ డ్రైవర్లు దొంగతనం గా కొన్ని రోజుల నుంచి అన్లోడింగ్ చేస్తున్నారన్నారు. గుర్నాథ్ రెడ్డి, రాజేష్ ఫిర్యాదు మేరకు నిన్న అర్థరాత్రి మోహన్ రెడ్డికి చెందిన సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో అన్ అన్ లోడ్ చేస్తుండగా 4 ట్రాలీ వెహికల్ లను అదుపులోకి తీసుకుని బీడీఎల్ బానూర్ పోలీసులు సీజ్ చేసినట్లు చెప్పారు. ఎవరు అన్ లోడ్ చేస్తున్నారనే విషయంపై విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు.