69
కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా గన్నవరం లోని స్థానిక తాసిల్దార్ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహానికి, దళితవాడలోని అంబేద్కర్ విగ్రహాలకు గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ యార్లగడ్డ వెంకట్రావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం -జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.