వ్యక్తిగత స్వార్ధ ప్రయోజనాల కోసం వెంపర్లాడుతూ, అధికారాన్ని చేజిక్కించుకొని ధనవంతులుగా మారి అహంకారంతో బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్న వారిని ఓడించాలని సిపిఎంఎల్ ప్రజాపంద ఇల్లందు ఇండిపెండెంట్ అభ్యర్థి గుమ్మడి అనురాధ.. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలోని సిపిఐ ఎంఎల్ ప్రజాపంద పార్టీ కార్యాలయంలో పత్రిక విలేకరుల సమావేశం గుమ్మడి అనురాధ మాట్లాడుతూ.. ఇల్లెందుకు ఉన్న చారిత్రాత్మక నేపథ్యాన్ని విస్మరించి కొందరు స్వార్ధపరులు గెలిచిన తర్వాత ఇల్లందును స్వార్థ రాజకీయాలకు నిలయంగా మార్చారని అన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు బిఆర్ఎస్ అభ్యర్థులేనని అన్నారు. వారు గెలిచిన తర్వాత అధికార పార్టీలోకి ఇల్లెందు నియోజకవర్గ అభివృద్ధి కోసమే మారుతున్నామని చెప్పి గెలిసిన ప్రజలను మోసం చేసి వారి అభివృద్ధి కోసమే అధికారాన్ని ఉపయోగించుకుంటున్నారని అన్నారు … బయ్యారం ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఏ మాత్రం కృషి చేయని కనకయ్య, హరిప్రియలకు ప్రజలు మరోసారి అవకాశం కల్పిస్తే ప్రజలు మరోసారి మోసానికి గురికాక తప్పదని వారన్నారు… ఇప్పటివరకు గెలిచిన ఎమ్మెల్యేలు అభివృద్ధి అంటే మొక్కలు నాటడం సెంట్రల్ లైటింగ్ రోడ్ల లాంటి వాటినే అభివృద్ధి నమూనాగా చూపించారు, శాశ్వత అభివృద్ధి చేయకుండా కుంటి సాగుతో దాటివేసారని ఆవేదన వ్యక్తం చేశారు. బయ్యారం మండలంలోని పెద్ద చెరువు కు సీతారామ ప్రాజెక్టు నీటిని నింపుటకు ఒక డిజైన్ ఏర్పాటు చేస్తే అదే బిఆర్ఎస్ పార్టీలో ఉన్న మరో లీడర్ బయ్యారం చెరువుకు నీళ్లు రాకుండా వేరే ప్రాంతం నుండి బయటికి మార్చిన స్థితి ఇక్కడ కనపడుతుంది ఇదేనా మీరు బయ్యారం ప్రాంతానికి చేసిన అభివృద్ధి అని అన్నారు .ఇక్కడ అనేక ఉద్యమాలతో సాధించుకున్న పోడు భూములకు పట్టాలి ఇవ్వకపోగా హరితహారం పేరుతో ఆ భూములను గుంజుకొని గిరిజనులను అడవి నుండి గెంటేసే పరిస్థితి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం వెలుగులో వారి సమస్యల కోసం పోరాటాలకు ముందుకు రావడానికి ఒక విద్యావంతురాలుగా ముందుకు వచ్చారని అన్నారు. బయ్యారం మండల ప్రజలు నన్ను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు..
79
previous post