ఆ మహానుభావుడి పేరుతో జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్….

Minister Ponnam Prabhakar

Advertisements

&NewLine;<p>దివంగత ప్రధాని పీవీ నరసింహారావును గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని రాష్ట్ర బీసీ రవాణా సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు&period; హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో పీవీ 19వ వర్ధంతి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ బిఆర్ఎస్ పాలనలో జిల్లాల పునర్విభజన జరిగే సందర్భంలో చరిత్రకారులకు&comma; తెలంగాణ పోరాట యోధులకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి సలహాలతో మహానుభావుడు పీవీ నరసింహారావు పేరుతో జిల్లా ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేసిన మేధావుల వాదనపై చర్చలు జరుపుతామని పివి జిల్లా సాధన సమితి సభ్యులతో అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మెదక్ నుండి ఎల్కతుర్తికి నిర్మాణం జరుగుతున్న హైవేకు పివి పేరును పెట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు&period; పివీ ప్రధానిగా ఉన్న సమయంలో అప్పటి కేంద్ర మంత్రి జి&period; వెంకటస్వామి నేతృత్వంలో 40 వేల కోట్లతో గ్రామీణ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించిన ఘనత పివికే దక్కుతుందన్నారు&period; పివి శతజయంతి ఉత్సవాల్లో ప్రకటించిన విధంగా గత ప్రభుత్వంలో 11 కోట్లతో నిర్మితమవుతున్న పీవీ స్మృతి వనానికి సంబంధించి మిగిలిన పనులపై ఒక నివేదిక ఏర్పాటు చేసి పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు&period; రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పటిష్ట పరచడానికి నవోదయ&comma; గురుకులాలు 45 వరకు ఏర్పాటు చేసిన ఘనత పివిదే అన్నారు&period; పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి వేల కోట్ల రూపాయలు కేటాయించారని అన్నారు&period; భూస్వామి అయినప్పటికీ నిరుపేదలకు భూమి పంచడానికి భూసంస్కరణలు తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు&period; దేశం గర్వించదగ్గ మహనీయుని సేవలను నిరంతరం ఇప్పటి తరానికి పాఠ్యపుస్తకాలల్లో&comma; దృశ్యరూపాల్లో చరిత్రను సజీవంగా అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అనంతపురం జిల్లాలో ఆర్‌ఎంపీ డాక్టర్ల దందా..

అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం..

ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..