66
భారత దేశంలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొన్నాయని సీ.పి.ఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఏలూరు లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎప్పుడూ లేని విధంగా పార్లమెంటులో ఒకే సేషన్ లో 141 మంది ఎంపీలను సస్పెండ్ చేయడానికి ఖండిస్తున్నామని అన్నారు. మోడీ ప్రభుత్వంలో పార్లమెంట్ లో ఎంపీలకు రక్షణ కరువయ్యిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం లో ఇరిగేషన్ ప్రాజెక్టులు గాలికి వదిలేసి వాటి మీద తెచ్చిన అప్పులను తమ సొంత ఖాతాలలో జమ చేసుకున్నారని, దోచుకో దాచుకో అన్న చందాన రాష్ట్ర ప్రభుత్వ పాలన జరుగుతుందని ఆయన విమర్శించారు.
Read Also..