తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడి కార్యకర్తలు చేస్తున్న సమ్మె కొనసాగుతోంది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్ డివో కార్యాలయాన్ని సుమారు 1000 మంది అంగన్వాడి సిబ్బంది ముట్టడించారు. ఏడురోజుల నుంచి సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీ్ర్లను, సచివాలయ సిబ్బంది చేత అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగులగొట్టించి ఓపెన్ చేయడాన్ని తప్పుపట్టారు. సమ్మెను విఫలం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అయినప్పటికీ తమ సమస్యలు నెరవేరేవరకు సమ్మెను విరమించబోమని అంగన్వాడీలు తేల్చి చెప్పారు. ప్రభుత్వం తక్షణమే అంగన్వాడీ కార్యకర్తలకు 26 వేల జీతం చెల్లించాలని, పెండింగ్ లో ఉన్న సెంటర్ల అద్దెలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే వేతనంతో కూడిన మెడికల్ లీవు సౌకర్యం కల్పించి, రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సాలకు పెంచాలని కోరారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో సమ్మెను ఉధృతంగా చేస్తామని అంగన్వాడీలు హెచ్చరించారు.
అంగన్వాడి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్..!
82
previous post