భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామివారిని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, అధికారులు నందినిని ఆలయ మర్యాదలతో ఆలయంలోకి ఆహ్వానించి క్షేత్ర విశిష్టతను తెలియజేశారు.
ఇది చదవండి: చిలుకూరి బాలాజీ దేవాలయం
ప్రత్యేక పూజల అనంతరం భట్టి సతీమణికి శ్రీ లక్ష్మీ తాయారు అమ్మ వారి కోవెలలో అర్చకులు స్వామివారి ప్రసాదాలను అందించి వేద ఆశీర్వచనాలు అందించారు. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నానని నందిని తెలిపారు. 10 ఏళ్ళ BRS పాలనలో భద్రాచల రామాలయాన్ని అభివృద్ధి చేయడాన్ని మర్చిపోయారని విమర్శించారు. కాంగ్రెస్ గవర్నమెంట్ లో కచ్చితంగా రామాలయాన్ని అభివృద్ధి చేస్తామని భట్టి సతీమణి తెలిపారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.