విజయవాడ,
దేవినేని నెహ్రూ వర్ధంతిలో దేవినేని అవినాష్(Devineni Avinash) పాల్గొన్నారు…
మాజీమంత్రి దేవినేని నెహ్రూ వర్ధంతి సందర్భంగా నెహ్రు ఘాట్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అతని కుమారుడు తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
దేవినేని అవినాష్ కామెంట్స్…
నెహ్రు వర్ధంతి సందర్భంగా ఆయనతో అత్యంత సన్నిహితంగా ఉండే నాయకులు అందరూ కార్యక్రమంలో పాల్గొన్నారు. నెహ్రు జీవితాంతం పేద ప్రజల కోసం పని చేశారు. ఎన్టీఆర్ ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చి వైఎస్ఆర్ తో కూడా కలిసి పని చేశారు. ఐదు సార్లు ఎమ్మెల్యే గా ఒక్కసారి మంత్రిగా పని చేసిన ఘనత నెహ్రూది.
మాట ఇస్తే మడం తిప్పని నైజం నెహ్రుది | Devineni Avinash
కార్యకర్తల కోసం ఏ పోరాటానికి అయిన సిద్ధంగా ఉండేవారు. నెహ్రు చేసిన మంచి పనులు చిరస్థాయిగా నిలిచిపోతాయి. విజయవాడ కొండ ప్రాంతాల ప్రజలు నెహ్రునీ ఎప్పటికీ మరిచిపోరు. నెహ్రు ఆశయ సాధన కోసం పని చేస్తాం. రాబోయే రోజుల్లో ప్రజా శ్రేయస్సు కోసం మరింత కష్టపడి పని చేస్తాం అని హామీ ఇస్తున్నాం. ఉమ్మడి కృష్ణాజిల్లాలో నెహ్రూని మించిన నాయకుడు మరొక్కరు లేరు. మనిషి లేకపోయినా నెహ్రు మిద అభిమానం అందరికి అలాగే ఉంది. నెహ్రు అభిమానులు, అనుచరులు, పేద ప్రజల అందరికి అండగా ఉంటాం.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: మాజీ మంత్రి దేవినేని నెహ్రూ వర్ధంతి.. నేతల ఘన నివాళి…