కుప్పంలో శ్రీ ప్రసన్న గంగమ్మ జాతర

కుప్పంలో శ్రీ ప్రసన్న గంగమ్మ జాతర

Advertisements

<p>చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం ప్రస్తుతం ఆధ్యాత్మిక శోభతో పులకించిపోతోంది&period; ప్రసిద్ధ శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర గత నాలుగు రోజులుగా అంగరంగ వైభవంగా సాగుతోంది&period; రంగురంగుల విద్యుత్ దీపాలు&comma; విభిన్న కళా సాంస్కృతిక కార్యక్రమాలు&comma; మనోహరమైన పాటకచేరీలతో కుప్పం వీధులన్నీ పండగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి&period; కేవలం మన రాష్ట్రం నుంచే కాకుండా&comma; పక్కనే ఉన్న తమిళనాడు&comma; కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు కుప్పానికి భారీగా తరలివస్తున్నారు&period; భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ సైతం జాతర జరిగే ఎనిమిది రోజుల పాటు అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లను కుప్పం స్టేషన్‌లో నిలపాలని నిర్ణయించింది&period; ఇక జాతరలో అత్యంత కీలక ఘట్టం నేడు ఆవిష్కృతం కానుంది&period; ఇవాళ గంగమ్మ అమ్మవారి విశ్వరూప దర్శన మహోత్సవం జరగనుంది&period; ఈ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా హాజరుకానున్నారు&period; ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు&comma; సారె సమర్పించనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్లో నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం…

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం..