జీగిరాం జ్యూట్ ఫ్యాక్టరీ మూతతో కార్మికుల జీవితం ఛిద్రం ..

జీగిరాం జ్యూట్ ఫ్యాక్టరీ మూతతో కార్మికుల జీవితం ఛిద్రం

Advertisements

<p>పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు జీగిరాంలో ఒకప్పుడు వేలాది కుటుంబాలకు జీవనాధారంగా నిలిచిన జ్యూట్ ఫ్యాక్టరీ నేడు మూతపడిన గేట్లతో కార్మికుల కన్నీటి గాథగా మారింది&period; 1986 డిసెంబర్ 9à°¨ అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చేతుల మీదుగా ప్రారంభమైన ఈ పరిశ్రమ మొదట 400 మంది కార్మికులతో ప్రారంభమై&comma; తర్వాత అభివృద్ధి చెంది మూడు వేల మందికి ఉపాధి కల్పించింది&period; ఈ ఫ్యాక్టరీపై ఆధారపడి 15 వేల మందికి పైగా కుటుంబ సభ్యులు జ్యూట్ కాలనీలో జీవనం సాగించారు&period; కానీ గన్ని బ్యాగులకు డిమాండ్ తగ్గిందనే కారణాలతో 2022లో యాజమాన్యం లాకౌట్ ప్రకటించడంతో కార్మికుల జీవితాలు ఒక్కసారిగా అస్తవ్యస్తమయ్యాయి&period; నాలుగేళ్లుగా ఉపాధి లేక అనేక కుటుంబాలు ఆకలి కేకలతో బతుకుతున్నాయి&period; ప్రజాప్రతినిధులను కలిసినా&comma; ఫ్యాక్టరీ ఎదుట నిరాహార దీక్షలు చేసినా ప్రయోజనం లేకపోయిందని కార్మికులు వాపోతున్నారు&period; పిల్లలకు రెండు పూటల భోజనం పెట్టలేని పరిస్థితుల్లో కొందరు హోటళ్లలో చిన్న పనులు చేస్తుండగా&comma; మరికొందరు వలస కూలీలుగా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు&period;<&sol;p>&NewLine;<p>జీగిరాం జ్యూట్ కాలనీలో ఒకప్పుడు కార్మికుల సందడితో కళకళలాడిన వీధులు ఇప్పుడు వెలవెలబోతున్నాయి&period; ఫ్యాక్టరీ మూతపడటంతో స్థానిక ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదేలైంది&period; జ్యూట్ మిల్లుపై ఆధారపడి నడిచిన చిన్న వ్యాపారాలు&comma; దుకాణాలు&comma; రవాణా రంగం కూడా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి&period; ఉపాధి కోల్పోయిన కార్మికులు కుటుంబ పోషణ కోసం కూలి పనులు చేస్తూ అవస్థలు పడుతున్నారు&period; కొందరు పిల్లల చదువులు ఆపివేసి జీవన పోరాటంలో దిగాల్సి వచ్చింది&period; &OpenCurlyDoubleQuote;మాకు హామీలు కాదు… పని కావాలి” అంటూ కార్మికులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు&period; రాజకీయ నాయకులు ఇప్పటికైనా చొరవ తీసుకుని ఫ్యాక్టరీ యాజమాన్యంతో చర్చలు జరిపి జ్యూట్ మిల్లును తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు&period; ఫ్యాక్టరీ పునఃప్రారంభమైతే వేలాది కుటుంబాలకు మళ్లీ జీవనోపాధి లభిస్తుందని కార్మికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు&period; నాలుగేళ్లుగా మూతపడిన ఈ పరిశ్రమ మళ్లీ పనిచేస్తే జీగిరాం ప్రాంతంలో తిరిగి వెలుగులు నిండతాయని స్థానికులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్లో నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం…

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం..