అయోధ్య రామాలయం విరాళాల చోరీ కేసులో సంచలన నిజాలు.

అయోధ్య రామాలయం విరాళాల చోరీ కేసులో సంచలన నిజాలు

Advertisements

<p>అయోధ్య రాముడి సొమ్ముపైనే కన్నేశారు&period; భక్తులు భక్తితో సమర్పించుకున్న కానుకలను అడ్డంగా దోచేశారు&period; కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కావడంతో యూపీ ప్రభుత్వం ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకుంది&period; రామాలయంలో ఇంటి దొంగల పని పట్టేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను నియమించింది&period; ఆలయంలో నిందితులు చోరీకి ఎలా పాల్పడ్డారు&period; ఈ దోపిడీ వెనుక ఇంకెవరెవరి పాత్ర ఉందన్న దానిపై లోతుగా దర్యాప్తు చేపట్టింది&period; అయితే సిట్ దర్యాప్తులో విస్తుపోయే అంశాలు బయటపడ్డాయి&period; 2025 ప్రారంభంలో జరిగిన కుంభమేళా సమయాన్నే ఈ దొంగల ముఠా టార్గెట్ చేసుకుంది&period; కేవలం ఒకరిద్దరు కాకుండా ఈ చోరీ వెనుక ఏకంగా ఓ ముఠానే పనిచేసినట్లు సిట్ గుర్తించింది&period; ఇప్పటికే అరెస్ట్ అయిన 8 మంది నిందితులను సుదీర్ఘంగా విచారించగా సంచలన విషయాలు బయటపడ్డాయి&period;<&sol;p>&NewLine;<p>కుంభమేళా సమయంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరగడం&period;&period; కానుకలు&comma; విరాళాలు వెల్లువెత్తడంతో&period;&period; అదే అదనుగా కోట్లాది రూపాయల నగదును గుట్టుచప్పుడు కాకుండా పక్కదారి పట్టించారు&period; ఈ మొత్తం కుట్రలో లవకుష్ మిశ్రా&comma; అనుకల్ప్ మిశ్రా అనే బావమరుదుల పాత్ర అత్యంత కీలకంగా మారింది&period; రాముడి సొమ్మును దొంగిలించి&period;&period; వీరు అరడజనుకు పైగా బినామీ ఆస్తులు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు&period; చోరీకి పాల్పడిన సొమ్ముతో ఈ ఇద్దరూ పెద్ద ఎత్తున ఆస్తులు కొనుగోలు చేశారని వీరికి సంబంధించిన అరడజన్‍కు పైగా ఆస్తులను పోలీసులు ఇప్పటికే గుర్తించారు&period; నిందితుల ఆర్థిక లావాదేవీలు&comma; ఆస్తుల వివరాల గుట్టు తేల్చేందుకు మరింత లోతైన దర్యాప్తుకోసం అయోధ్య పోలీసులు ఐటీ డిపార్ట్మెంట్ సహాయం తీసుకుంటున్నారు&period; ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు కోసం ఈడీకి అధికారులు లేఖ రాయనున్నట్లు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;<p>ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న సిట్ పోలీసులు&period;&period; ఇప్పటివరకు అవినాష్ శుక్లా&comma; అనుకల్ప్ మిశ్రా&comma; లవకుష్ మిశ్రా సహా ఎనిమిది మంది నిందితులను కటకటాల వెనక్కి నెట్టారు&period; వీరిలో ఆలయ ట్రస్ట్ మాజీ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ వద్ద డ్రైవర్‌గా పనిచేసిన తిన్ను యాదవ్ కూడా ఉండటం సంచలనంగా మారింది&period; ఇక రికవరీ సీన్లు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే&period;&period; ప్రధాన నిందితుడు అవినాష్ శుక్లా ఇచ్చిన సమాచారంతో&period;&period; జూన్ 5à°¨ పోలీసులు ఒక యోగా కేంద్రంపై దాడి చేశారు&period; అక్కడ నాలుగు బాక్సుల్లోని దుప్పట్ల మధ్య దాచిపెట్టిన ఏకంగా 89 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు&period; ఈ సొమ్మును అవినాష్ సోదరుడికి చెందిన ఒక యోగా కేంద్రంలో&comma; నాలుగు బాక్సులలోని దుప్పట్ల మధ్య దాచి ఉంచగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు&period;<&sol;p>&NewLine;<p>ప్రధాన నిందితులైన అనుకల్ప్&comma; లవకుశ్ దొంగిలించిన సొమ్ముతో ఫామ్‌హౌస్&comma; రూ&period;65 లక్షల విలువైన ఇల్లు మరియు పలు ప్లాట్లను కొనుగోలు చేసినట్లు నిర్ధారణ అయింది&period; అంతేకాకుండా&comma; స్కార్పియో వంటి విలాసవంతమైన కారును కొనుగోలు చేసేందుకు కూడా సిద్ధమయ్యారు&period; వారి జీవనశైలిలో అకస్మాత్తుగా వచ్చిన మార్పులే పోలీసుల అనుమానాలకు కారణమయ్యాయి&period; మరోవైపు ఆలయంలోని విరాళాలను లెక్కించే బాధ్యత కలిగిన కొంతమంది SBI సిబ్బంది పాత్రపైన కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు&period; రామాలయంలోని నాలుగు డొనేషన్ బాక్సుల నగదును లెక్కించే బాధ్యతను ఎస్బీఐ ఒక ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించగా ఈ బ్యాంకుకు చెందిన 11 మంది సిబ్బంది&comma; ఆలయ ట్రస్ట్‌కు చెందిన ముగ్గురు మొత్తం 14 మంది సభ్యుల బృందం ఈ లెక్కింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు&period; ఈ లెక్కింపు ప్రక్రియలోని లొసుగులని ఆసరాగా చేసుకుని నిందితులు చేతివాటం ప్రదర్శించినట్లు సిట్ అధికారులు చెప్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>మరోవైపు అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయ విరాళాల దుర్వినియోగం కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ పరిధిని పెంచుతూ యోగీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది&period; ఈ కేసులో అన్ని కోణాలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు&comma; దర్యాప్తు పరిధిని మరింత విస్తృతం చేసేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి&period; ఈ స్కామ్‌లో ఎంతటి వారున్నా వదిలిపెట్టేది లేదని&comma; ప్రతి ఒక్క కోణాన్ని నిష్పక్షపాతంగా విచారించనున్నట్లు ఎస్‌ఐటీ స్పష్టం చేసింది&period; అలాగే దర్యాప్తు చేస్తున్న సిట్ గడువు ముగియడంతో&period;&period;మరో మరో 15 రోజుల అదనపు గడువు పొడిగించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.