పూరీలో వైభవంగా జగన్నాథ రథయాత్ర.

పూరీలో వైభవంగా జగన్నాథ రథయాత్ర

Advertisements

<p>ఒడిశాలోని పూరీ క్షేత్రంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా ప్రారంభమైంది&period; ఈ మహోత్సవంలో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు పూరీకి తరలివచ్చారు&period; జగన్నాథుడు&comma; బలభద్రుడు&comma; సుభద్ర దేవి కొలువై ఉన్న రథాలను లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు&period;&OpenCurlyQuote;జై జగన్నాథ్’ నినాదాలతో పూరీ వీధులు మార్మోగాయి&period;<&sol;p>&NewLine;<p>ఏడాదికి ఒకసారి గర్భగుడి నుంచి బయటకు వచ్చి&comma; గుండిచా ఆలయంలోని తన అత్తవారింటికి వెళ్లే జగన్నాథుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు&period; ఈ యాత్ర భారతదేశ ఆధ్యాత్మిక&comma; సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని ప్రధాని మోదీ &OpenCurlyQuote;ఎక్స్’ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు&period; జగన్నాథుడి ఆశీస్సులతో అందరూ ఆరోగ్యంగా&comma; సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు&period;<&sol;p>&NewLine;<p>రథయాత్రకు భారీ సంఖ్యలో భక్తులు వస్తారన్న అంచనాతో ఒడిశా ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసింది&period; భద్రత కోసం 13&comma;000 మందికి పైగా పోలీసు సిబ్బందిని&comma; కేంద్ర బలగాలను మోహరించారు&period; 19 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు&period; 473 సీసీటీవీ కెమెరాలు&comma; 65 భారీ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు&period; భక్తుల సౌకర్యార్థం భారతీయ రైల్వే జగదల్‌పూర్&comma; రాయగడ నుంచి పూరీకి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది&period; పూరీ తర్వాత దేశంలోనే రెండో అతిపెద్ద రథయాత్ర గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరుగుతుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నీట్ పేపర్ లీక్పై పోరాడుతున్న సోనమ్ వాంగ్చుక్.

పాకిస్తాన్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.

విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటు బోల్తా.