వేములవాడ (Vemulawada)..
తెలంగాణలోనే ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన వేములవాడ (Vemulawada) శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. రాములోరి కళ్యాణం తిలకించడానికి దాదాపు 1 లక్షకు పైగా భక్తులు హజరయ్యారు. ఆలయ అర్చకులు వేద మంత్రోత్సవాల మధ్య 2 గంటల సేపు కళ్యాణం వైభవంగా జరిపించారు. దేవాలయం తరుపున ఆలయ ఈఓ కృష్ఱ ప్రసాద్, మున్సిపల్ తరుపున కమీషనర్ అన్వేష్ శ్రీ స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
ఇది చదవండి : శ్రీ సీతారాముల కల్యాణానికి ముహూర్తం ఖరారు..
కల్యాణం తిలకించడానికి దేశం నలుమూలల నుండి శివపార్వతులు, జోగినీలు హజరయ్యారు. ఒక వైపు సీతారాముల కళ్యాణం జరుగుతుంటే మారో వైపు జోగినిలు, శివపార్వతులు ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకుంటూ శివుడిని వివాహం అడారు. దేశంలో మారెక్కడ లేని విధంగా ఇలా రాముడి కళ్యాణం సందర్భంగా శివుడిని జోగినిలు, శివపార్వతులు కళ్యాణం చేసుకోవడం ఇక్కడ అనవాయితీగా కోనసాగుతుంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: రాజన్న సన్నిధిలో.. రాములోరి కల్యాణం..