కర్ణాటకలో వింత ప్రేమ వివాహం..

కర్ణాటకలో వింత ప్రేమ వివాహం

Advertisements

<p>ప్రేమకు కళ్లు లేవు&period;&period; కులమతాలు తెలియవు&period;&period; అంతవరకు బాగానే ఉంది కానీ&period;&period; కనీసం రక్తం పంచుకున్న వరుసలైనా గుర్తుండవా&quest; అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది ఓ కన్నతల్లి&period; నిశ్చితార్థం ముగిసి&comma; పెళ్లి పత్రికలు పంచేసి&comma; మరికొద్ది గంటల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వధువు&period;&period; వరుసకు తమ్ముడయ్యే సొంత పిన్ని కొడుకుతో లేచిపోయి పెళ్లి చేసుకున్న వింత ఘటన కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది&period; మూడు సంవత్సరాల ప్రేమ కోసం కట్టుబాట్లను&comma; రక్తసంబంధాలను కాలరాస్తూ ఈ జంట ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కి రక్షణ కల్పించాలంటూ కోరడం స్థానికంగా పెను సంచలనం సృష్టించింది&period;<&sol;p>&NewLine;<p>బెంగళూరు గ్రామీణ జిల్లా దేవనహళ్లి తాలూకా సావకనహళ్లి గ్రామానికి చెందిన శశికల&comma; హోస్కోట్ తాలూకాకు చెందిన ప్రవీణ్ గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు&period; అయితే&comma; వీరిద్దరి తల్లులు స్వయానా అక్కాచెల్లెళ్లు&period; అంటే వరుసకు శశికల అక్క&comma; ప్రవీణ్ తమ్ముడు అవుతారు&period; ఈ విషయం తెలిసి ఇరువైపులా పెద్దలు వీరి ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించారు&period; సమాజం ఒప్పుకోని ఈ బంధాన్ని వద్దంటూ వారించారు&period;ఈ క్రమంలోనే శశికల తల్లిదండ్రులు ఆమెకు మరో యువకుడితో వివాహం నిశ్చయించి&period;&period; లగ్నపత్రికలు కూడా పంచారు&period;<&sol;p>&NewLine;<p>ఇంకేముంది పెళ్లికి అంతా సిద్ధమైంది అనగా&period;&period; శశికల తన ప్రియుడు ప్రవీణ్‌తో కలిసి ఊరు వదిలి పారిపోయింది&period; అనంతరం స్థానిక అంగట్ట ప్రాంతంలోని ఒక శివాలయంలో ఇద్దరూ సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు&period; పెళ్లి తర్వాత తమ తల్లిదండ్రుల నుండి ప్రాణభయం ఉందంటూ ఈ నూతన వధూవరులు చిక్కబళ్లాపూర్ జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకుని రక్షణ కోరారు&period; ప్రస్తుతం సామాజిక కట్టుబాట్లను సవాల్ చేసిన ఈ వింత పెళ్లి వ్యవహారం కన్నడ నాట సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..