124
సినీ నటుడు,డీఎండీకే అధినేత విజయ్ కాంత్ మృతి చెందాడు. ఈ విషయాన్ని తమిళనాడు ఆరోగ్య శాఖ సెక్రటరీ ప్రకటించారు. చెన్నైలోని మియోట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విజయ్ కాంత్ మరణించాడు. 1952 ఆగస్టు 25న విజయ్ కాంత్ జన్మించారు. గత కొంత కాలంగా విజయ్ కాంత్ అనారోగ్యంతో ఉన్నారు. విజయ్ కాంత్ మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న అభిమానులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. తమిళ రాజకీయాల్లో విజయ్ కాంత్ కీలకంగా వ్యవహరించారు. 2005 సెప్టెంబర్ 14న డీఎండీకెను విజయ్ కాంత్ ఏర్పాటు చేశారు.