కలగానే మిగిలిన సొంతింటి కల..

Advertisements

<p>పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం&comma; సాలూరు నియోజకవర్గాల్లో పేదల సొంతింటి కల ఇంకా అటకెక్కే ఉంది&period; గత ప్రభుత్వ హయాంలో పార్వతీపురం మండలం అడ్డాపుశిల&comma; సాలూరు మున్సిపాలిటీ పరిధిలో భారీ ఎత్తున టిడ్కో ఇళ్లను నిర్మించారు&period; మొత్తం 1&comma;983 మంది లబ్ధిదారులకు ఈ ఇళ్లను మంజూరు చేశారు&period; భవనాల నిర్మాణం పూర్తయి వెలుగులీనుతున్నా&period;&period; లోపల ఉండాల్సిన లబ్ధిదారులు మాత్రం ఇంకా అద్దె ఇళ్లలోనే కాలం వెళ్లదీస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>కేవలం గోడలు కట్టి రంగులు వేశారు&period; అక్కడ మనుషులు ఉండాలంటే కనీస మౌలిక వసతులు కల్పించలేదు&period; డ్రైనేజీ వ్యవస్థ లేదు&comma; తాగునీటి సౌకర్యం లేదు&comma; విద్యుత్ కనెక్షన్లు సరిగ్గా లేవు&period; గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇళ్లు సిద్ధంగా ఉన్నా లబ్ధిదారులు లోపలికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది&period; ఈ నిర్మానుష్య వాతావరణాన్ని అదనుగా చేసుకున్న ఆకతాయిలు&comma; ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలకు తెరలేపుతున్నారు&period; పగలు&comma; రాత్రి అనే తేడా లేకుండా టిడ్కో ప్రాంగణాలు మందుబాబులకు&comma; జూదరులకు అడ్డగా మారుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p>డబ్బులు కట్టినా ఇళ్లు రాకపోవడం&comma; మరోవైపు చెల్లించిన సొమ్ములో కేవలం 30 లక్షలు మాత్రమే వెనక్కి ఇచ్చి అధికారులు చేతులు దులుపుకోవడంపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు&period; అయితే&comma; కూటమి ప్రభుత్వ హయాంలోనైనా తమకు న్యాయం జరుగుతుందని వారు ఆశిస్తున్నారు&period; మరోవైపు అధికారుల వెర్షన్ కూడా సానుకూలంగానే వినిపిస్తోంది&period; వచ్చే రెండు నెలల్లో మౌలిక వసతుల పనులన్నీ పూర్తి చేసి&comma; ఇళ్లను లబ్ధిదారులకు అప్పగిస్తామని అధికారులు హామీ ఇస్తున్నారు&period; మరి ఈసారైనా పేదల సొంతింటి కల నిజమవుతుందో లేదో వేచి చూడాలి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..