కడప జిల్లా… ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వడమే గాక, ఇల్లు కట్టించి ఇచ్చే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తున్నామని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చెప్పారు. ఒక్క వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలోను, మళ్లీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో తప్ప మరే ప్రభుత్వంలోనూ నిరుపేదలకు ఈ నియోజకవర్గంలో ఇల్లు మంజూరు కాలేదన్న విషయాన్ని ఎమ్మెల్యే సందర్భంగా గుర్తు చేశారు. తెలుగుదేశం నేతలు కేవలం విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు తప్ప, టిడిపి ప్రభుత్వం ఏ నిరుపేదకు ఏ ఇల్లు ఎక్కడ ఇచ్చిందో చెప్పాలని ఎమ్మెల్యే రాచమల్లు డిమాండ్ చేశారు. ప్రజా నేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా సోములవారి పల్లి జగనన్న కాలనీలో నూతన ఇళ్లను ఎమ్మెల్యే రాచమల్లు ప్రారంభించారు. నిరుపేదల సొంత ఇంటి కల నెరవేర్చిన ముఖ్యమంత్రికి నియోజక వర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు చెప్పారు. ఇళ్ళ నిర్మాణం విషయంలో కొంత ఆలస్యమైనా అర్హులకు సిఎం పుట్టిన రోజున వెయ్యి ఇళ్లు పూర్తి చేసి అందిస్తున్నామన్నారు. మీనపురం, బొల్లారం జగనన్న కాలనీలలో కూడా రాబోయే మూడు నాలుగు నెలల్లో 17 వేల ఇళ్లు పూర్తి చేసి ఇస్తామన్నారు. అయితే నియోజక వర్గంలో 24 వేల ఇళ్లు ఇవ్వటమే కాక వాటిని నిర్మించి ఇచ్చే బాధ్యతను తీసుకున్నామన్నారు. సోములవారి పల్లెలోని రామేశ్వరం జగనన్న కాలనీ ఇళ్ళ ప్రారంభోత్సవంలో మున్సిపల్ చైర్ పర్సన్ వీనుపల్లి లక్ష్మీదేవి, ఆప్కాబ్ చైర్మన్ మల్లెల ఝాన్సీ రాణి, పద్మ చెలియా, కార్పొరేషన్ చైర్మన్ జింక విజయలక్ష్మి, వైసిపి నాయకులు నరసింహారెడ్డి, కల్లూరు నాగేంద్ర రెడ్డి, వరుకూటి ఓబుల్ రెడ్డి, పిట్ట బాలాజీ పాతకోట వంశీధర్ రెడ్డి, ఎంపీపీ శేఖర్ యాదవ్ ఇతర నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు..
జగన్ హయాంలో నెరవేరిన సొంత ఇంటి కల..
66
previous post