ప్రజల ప్రాణాలకు ముప్పుగా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్

Advertisements

<p>జిహెచ్ఎంసి పరిధిలోని మొత్తం చెత్తను జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కే తరలిస్తున్నారు &period; దింతో స్థానిక ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారింది&period; నిబంధనల ప్రకారం చెత్తను శాస్త్రీయంగా ప్రాసెస్ చేయాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ&comma; నిర్వహణలో తీవ్ర లోపాలు బయటపడుతున్నాయి&period; ముఖ్యంగా రాంకీ సంస్థ కేవలం చెత్తను పోగు చేయడానికే పరిమితమైందన్న ఆరోపణలు వస్తున్నాయి &period; డంపింగ్ యార్డ్ నుంచి వెలువడుతున్న విషవాయువులతో పరిసర ప్రాంతాల ప్రజలను శ్వాసకోశ వ్యాధులు సోకుతున్నాయి &period; చిన్నపిల్లలు&comma; వృద్ధులు మరింతగా ఇబ్బందులు పడుతున్నారు&period; గాలి&comma; నీటి కాలుష్యం కారణంగా చర్మవ్యాధులు కూడా విస్తరిస్తున్నాయి&period; ఇంతటి ప్రమాదకర పరిస్థితి నెలకొన్నప్పటికీ&comma; సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి&period; ప్రజల ఆరోగ్యం కంటే కాంట్రాక్ట్ సంస్థల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారనే అభిప్రాయం బలపడుతోంది&period;<&sol;p>&NewLine;<p>జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్యపై స్థానిక ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; &OpenCurlyDoubleQuote;తాము మనుషులం… చెత్త మధ్య బ్రతకడానికి పుట్టలేదు” అంటూ ఆవేదన చెందుతున్నారు &period; నగరంలోని మొత్తం చెత్తను ఒకే ప్రాంతానికి తరలించడం వల్ల అక్కడి వాతావరణ కాలుష్యం పెరిగిపోతోంది&period; చెత్తను వేరు చేసే విధానం పాటించకుండా&comma; ఒకే డంపింగ్ యార్డ్‌పై ఆధారపడటం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందని స్థానికులు అంటున్నారు &period; చెత్తను వర్గీకరించి రీసైక్లింగ్ చేయడం&comma; శాస్త్రీయ &OpenCurlyQuote;క్యాపింగ్’ పద్ధతులు అమలు చేయడం అత్యవసరం అని నిపుణులు సూచిస్తున్నారు &period; అదే సమయంలో బాధిత ప్రజలకు తక్షణ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఉచిత వైద్యం అందించాల్సిన అవసరం కూడా ఉంది&period; రాంకీ సంస్థ ఒప్పంద నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు&period; ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమగ్ర చర్యలు తీసుకోకపోతే&comma; ఈ సమస్య మరింత తీవ్రమై పెద్ద ఆరోగ్య సంక్షోభంగా మారే ప్రమాదం ఉందని స్థానికులు వాపోతున్నారు &period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..