అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దుప్పితూరు గ్రామం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

Advertisements

<p>అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దుప్పితూరు గ్రామం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది&period; గ్రామ తరలింపు అంశంపై తీవ్ర విభేదాలు వ్యక్తమవుతున్నాయి&period; ఒకవైపు గ్రామస్తులు 2004లో భూసేకరణ సమయంలో తమ గ్రామాన్ని ఉద్దేశపూర్వకంగా వదిలేశారని ఆరోపిస్తూ&comma; ఇప్పుడు 750 కుటుంబాలకు స్థలం కేటాయించి సరైన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు&period; అభివృద్ధి పేరుతో తమకు అన్యాయం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>మరోవైపు అధికారులు మాత్రం అప్పటికే చెల్లింపులు పూర్తయ్యాయని&comma; ప్రస్తుతం బ్రాండిక్స్ యాజమాన్యం తమ హక్కుల మేరకు గోడ నిర్మాణం చేపడుతోందని స్పష్టం చేస్తున్నారు&period; ఈ గోడ నిర్మాణాన్ని గ్రామస్తులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది&period; ఈ నేపథ్యంలో అసలు నిజం ఏంటి&quest; గ్రామస్తుల డిమాండ్లకు న్యాయం జరుగుతుందా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది&period;దుప్పితూరు గ్రామ వివాదంపై ప్రజా ప్రతినిధులు కూడా స్పందిస్తున్నారు&period; ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఈ సమస్యపై మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పరిష్కారం కనుగొనాలని సూచించారు<&sol;p>&NewLine;<p>గ్రామస్తులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు&period; అయితే స్థానికంగా పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది&period; ఒకవైపు గోడ నిర్మాణ పనులు కొనసాగుతుండగా&comma; మరోవైపు గ్రామస్తులు నిరసనలు తెలుపుతున్నారు&period; తమకు సరైన పునరావాసం&comma; నష్టపరిహారం అందే వరకు వెనక్కి తగ్గేది లేదని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు&period; ఈ వివాదం మరింత పెరగకుండా ఉండాలంటే అధికారులు&comma; ప్రజా ప్రతినిధులు తక్షణమే జోక్యం చేసుకుని స్పష్టమైన పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది&period; దుప్పితూరు సమస్యకు ఎప్పుడు ముగింపు పడుతుందో అనేది ఉత్కంఠగా మారింది<&sol;p>&NewLine;

Advertisements

Related posts

17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.

నీట్ పేపర్ లీక్‍పై సుప్రీంకోర్టులో విచారణ.

నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.