పశ్చిమ బెంగాల్ పై హామీల వర్షాన్నికురిపించారు ప్రధాని మోదీ..

Advertisements

<p>పశ్చిమ బెంగాల్ పై హామీల వర్షాన్నికురిపించారు ప్రధాని మోదీ&period; ఎన్నికల ప్రచారంలో భాగంగా హల్దియాలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు&period; ఈ సందర్భంగా బెంగాల్‌కు ఆరు గ్యారెంటీలను ప్రకటించారు మోదీ&period; ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న భయాందోళన వాతావరణాన్ని తొలగించి&comma; చట్టబద్ధమైన పాలనపై ప్రజలకు మళ్లీ నమ్మకం కలిగిస్తామని హామీ ఇచ్చారు&period; బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక&comma; రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం&comma; అధికారులు ప్రజలకు పూర్తి స్థాయిలో జవాబుదారీగా ఉంటారని గ్యారంటీ ఇచ్చారు&period; మమత హయాంలో జరిగిన ప్రతి కుంభకోణం&comma; అవినీతి&comma; మహిళలపై జరిగిన అకృత్యాలకు సంబంధించిన ఫైళ్లను మళ్లీ తెరిచి విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు&period; అవినీతికి పాల్పడిన వారు ఎవరైనా సరే చట్టం నుండి తప్పించుకోలేరని&comma; వారిని జైలుకు పంపుతామని మోదీ గ్యారంటీ ఇచ్చారు&period; ఇక రాజ్యాంగం కల్పించిన హక్కులను శరణార్థులందరికీ అందజేస్తామని&comma; అదే సమయంలో దేశంలోకి అక్రమంగా వచ్చిన చొరబాటుదారులను ఏరివేస్తామని స్పష్టం చేశారు&period; అలాగే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు&comma; ఉపాధ్యాయులకు 7à°µ వేతన సంఘం సిఫార్సులను అమలు చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

17 మెట్రో స్టేషన్లను ఉదయం ఏడున్నర నుంచి మూసివేత.

నీట్ పేపర్ లీక్‍పై సుప్రీంకోర్టులో విచారణ.

నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.