80
భారత్ నలుమూలలా భూమి కంపించింది. ఆగ్నేయంలో తమిళనాడు, నైరుతిలో కర్ణాటక, వాయవ్యంలో గుజరాత్, ఈశాన్యాన మేఘాలయ రాష్ట్రాల్లో భూప్రకంపనలు వచ్చాయి. మొదట కర్ణాటకలో భూమి కంపించింది. రాష్ట్రంలోని విజయపురలో ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. రిక్టర్ స్కేలుపై 3.1 తీవ్రత నమోదైంది. ఆ తర్వాత మరో 45 నిమిషాల వ్యవధిలో తమిళనాడులోని చెంగల్పట్టులో భూకంపం చోటుచేసుకుంది. ఇక్కడ 3.2 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. అనంతరం మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లో భూకంపం వచ్చింది. గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో ప్రకంపనలు సంభవించాయి. షిల్లాంగ్ లో 3.8 తీవ్రత నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ఈ మేరకు వివరాలు తెలిపింది.