66
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. న్యాల్కల్, ముంగి తదితర గ్రామాల్లో భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూమి కంపించడంతో పాటు తాము వింత వింత శబ్ధాలు విన్నామని ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్నారు. అయితే భూప్రకంపనల కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. ప్రకంపనలపై అధికారులు ఆయా గ్రామాల్లో ఆరాతీస్తున్నారు.