62
టాలీవుడ్ నటుడు ప్రకాష్ రాజ్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. ప్రణవ్ జ్యువెలర్స్‌కు సంబంధించిన 100 కోట్ల రూపాయిల మనీలాండరింగ్ కేసులో ఈ నోటీసులు ఇచ్చారు. తమిళనాడులోని తిరుచునాపల్లికి చెందిన ప్రణవ్ జువెలర్స్‌కి ప్రకాష్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ప్రణవ్ జ్యువెలర్స్ సంస్థ పోంజీ స్కీమ్ ద్వారా అధిక లాభాలు చూపి వంద కోట్లు వసూలు చేసింది. అనంతరం ప్రణవ్ జ్యువెలర్స్ బోర్డు తిప్పేసింది. వంద కోట్ల స్కామ్ జరగడంతో ప్రకాష్‌ను విచారించేందుకు నోటీసులు ఇచ్చినట్లు ఈడీ పేర్కొంది.