తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కారణంగా తాత్కాలికంగా వాయిదా పడిన సింగరేణి గుర్తింపు సంఘాల ఎన్నికల తేదీ ఖరారైంది. ఈ నెల 27న నిర్వహించనున్నట్టు డిప్యూటీ చీఫ్ కమిషనర్ ఆఫ్ లేబర్ శ్రీనివాసులు ప్రకటించారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. సింగరేణిలోని 13 కార్మిక సంఘాల నాయకులతో హైదరాబాద్లోని కార్మికశాఖ ఆఫీస్లో ఆయన భేటీ అయ్యారు. ఎన్నికల నిర్వహణకు ఏకాభిప్రాయం కుదరడంతో ప్రకటన చేశారు.
కాగా సింగరేణి గుర్తింపు సంఘాల ఎన్నికలు ఇప్పటికే ముగియాల్సి ఉన్నప్పటికీ తెలంగాణ ఎన్నికల కారణంగా వాయిదాపడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడడంతో సింగరేణి ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. ఇప్పటికే కార్మికుల ఓటరు లిస్టును ఎన్నికల అధికారి కార్మిక సంఘాల నాయకులకు అందజేశారు. కాగా ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ, గుర్తుల కేటాయింపు ముగిశాయి.
ఎన్నికల తేదీ ఖరారు….
74
previous post