రోజురోజుకూ టెక్నాలజీ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలో 2026 నాటికి ఎలక్ట్రిక్ ఎయిర్‌ట్యాక్సీని అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్ అడుగులు వేస్తోంది. ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ వచ్చేస్తోంది. 2026 నాటికి పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తామని ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్ చెబుతోంది. ఆర్చర్ ఏవియేషన్‌తో కలిసి తీసుకొస్తున్న ఇంటర్‌గ్లోబ్-ఆర్చర్ ఎయిర్‌టాక్సీతో తొలుత ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ నుంచి హరియాణాలోని గురుగ్రామ్‌కు సేవలందిస్తామని ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్ పేర్కొంది. ఈ రెండు ప్రాంతాల మధ్య రోడ్డు ప్రయాణానికి 60-90 నిమిషాల సమయం పడుతుండగా ఎయిర్ టాక్సీతో 7 నిమిషాల్లోనే వెళ్లవచ్చని తెలిపింది. ఒక్కో దానిలో నలుగురు ప్రయాణించ వచ్చని తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో ఎయిర్ టాక్సీ సేవలతో పాటు కార్గో, లాజిస్టిక్స్, వైద్య, అత్యవసర సేవలకూ వీటిని ఉపయోగిస్తామని ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్ వెల్లడించింది. చార్టర్ సేవలకూ సిద్ధమని తెలిపింది. భారత కార్యకలాపాల కోసం ఆర్చర్‌కు చెందిన 200 ఎయిర్‌ట్యాక్సీలను కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్ స్పష్టం చేసింది. భారత్‌లో పూర్తి విద్యుత్ ఎయిర్ టాక్సీ సేవలను ప్రారంభించి నిర్వహించేందుకు అవగాహనా ఒప్పందాన్ని(MOU) ఇరు కంపెనీలు కుదుర్చుకున్నాయి. ఇంటర్‌గ్లోబ్ గ్రూప్ ఎండీ రాహుల్ భాటియా, ఆర్చర్ సీసీఓ నిఖిల్ గోయెల్ ఎమ్‌ఓయూపై సంతకాలు చేశారు. ఈ సేవలకు సంబంధిత నియంత్రణ అనుమతులు రావాల్సి ఉంది. దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్‌లో ఒక భాగం కాగా.. అమెరికాకు చెందిన ఆర్చర్ ఏవియేషన్ అనేది ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ విభాగంలో దిగ్గజ సంస్థగా చెలామణి అవుతోంది.
ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ వచ్చేస్తోంది.. నలుగురు ప్రయాణించవచ్చు..!
67
previous post