ఎలక్ట్రిక్‌ ఎయిర్‌ ట్యాక్సీ వచ్చేస్తోంది.. నలుగురు ప్రయాణించవచ్చు..!

Electric Air Taxi

Advertisements

&NewLine;<p>రోజురోజుకూ టెక్నాలజీ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది&period; ఈ క్రమంలో 2026 నాటికి ఎలక్ట్రిక్‌ ఎయిర్‌ట్యాక్సీని అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా ఇంటర్‌గ్లోబ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అడుగులు వేస్తోంది&period; ఎలక్ట్రిక్‌ ఎయిర్‌ ట్యాక్సీ వచ్చేస్తోంది&period; 2026 నాటికి పూర్తి స్థాయి ఎలక్ట్రిక్‌ ఎయిర్‌ టాక్సీ సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తామని ఇంటర్‌గ్లోబ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ చెబుతోంది&period; ఆర్చర్‌ ఏవియేషన్‌తో కలిసి తీసుకొస్తున్న ఇంటర్‌గ్లోబ్‌-ఆర్చర్‌ ఎయిర్‌టాక్సీతో తొలుత ఢిల్లీలోని కన్నాట్‌ ప్లేస్‌ నుంచి హరియాణాలోని గురుగ్రామ్‌కు సేవలందిస్తామని ఇంటర్‌గ్లోబ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పేర్కొంది&period; ఈ రెండు ప్రాంతాల మధ్య రోడ్డు ప్రయాణానికి 60-90 నిమిషాల సమయం పడుతుండగా ఎయిర్‌ టాక్సీతో 7 నిమిషాల్లోనే వెళ్లవచ్చని తెలిపింది&period; ఒక్కో దానిలో నలుగురు ప్రయాణించ వచ్చని తెలిపింది&period; పట్టణ ప్రాంతాల్లో ఎయిర్‌ టాక్సీ సేవలతో పాటు కార్గో&comma; లాజిస్టిక్స్‌&comma; వైద్య&comma; అత్యవసర సేవలకూ వీటిని ఉపయోగిస్తామని ఇంటర్‌గ్లోబ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ వెల్లడించింది&period; చార్టర్‌ సేవలకూ సిద్ధమని తెలిపింది&period; భారత కార్యకలాపాల కోసం ఆర్చర్‌కు చెందిన 200 ఎయిర్‌ట్యాక్సీలను కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు ఇంటర్‌గ్లోబ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ స్పష్టం చేసింది&period; భారత్‌లో పూర్తి విద్యుత్‌ ఎయిర్‌ టాక్సీ సేవలను ప్రారంభించి నిర్వహించేందుకు అవగాహనా ఒప్పందాన్ని&lpar;MOU&rpar; ఇరు కంపెనీలు కుదుర్చుకున్నాయి&period; ఇంటర్‌గ్లోబ్‌ గ్రూప్‌ ఎండీ రాహుల్‌ భాటియా&comma; ఆర్చర్‌ సీసీఓ నిఖిల్‌ గోయెల్‌ ఎమ్‌ఓయూపై సంతకాలు చేశారు&period; ఈ సేవలకు సంబంధిత నియంత్రణ అనుమతులు రావాల్సి ఉంది&period; దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ఇంటర్‌గ్లోబ్‌ ఎంటర్‌ప్రైజెస్‌లో ఒక భాగం కాగా&period;&period; అమెరికాకు చెందిన ఆర్చర్‌ ఏవియేషన్‌ అనేది ఎలక్ట్రిక్‌ వర్టికల్‌ టేకాఫ్‌ అండ్‌ ల్యాండింగ్‌ విభాగంలో దిగ్గజ సంస్థగా చెలామణి అవుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గూగుల్‌ ప్లేస్టోర్‌లో 80 వేల యాప్‌ల తొలగింపు…

ప్రపంచ వ్యాప్తంగా కాసేపు నిలిచిన యూట్యూబ్ సేవలు….

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఘనంగా ప్రారంభమైంది.