నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో కిక్ ఎక్కితే గాని డాక్టర్లు వైద్యం చేయడం లేదు. దీంతో గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్లాలంటే నిరుపేదలు హడలిపోతున్నారు. దీనికి తోడు ప్రతి పనికి రేటు కట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. కట్లు కట్టాలంటే 200 రూపాయలు చెల్లిస్తేనే కడతారు. ఒక జబ్బుకు సరైన మందు ఇవ్వకుండా వేరే మందులు ఇస్తున్నారు. దురద మందుకు బదులుగా రాబిస్ ఇంజక్షన్ ఇస్తున్నారంటూ రోగులు వాపోతున్నారు. అంతే కాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల మోజులో పడి ఆస్పత్రికి డాక్టర్లు రావడమే మానేశారని చెబుతున్నారు. దీంతో వాచ్ మెన్ లే వైద్యుల అవతారం ఎత్తుతున్న దుస్థితి నెలకొంది. గత నెలరోజులుగా ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో తప్పుల మీద తప్పులు జరుగుతున్నా ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకోక పోవడంలో ఆంతర్యమేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రైవేట్ క్లీనిక్ లు నడుపుతున్న ప్రభుత్వ డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
కిక్ ఎక్కితే గాని వైద్యం చేయని వైనం..!
63