64
అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఎన్నికల కమిషన్ సర్వం సిద్ధం చేసింది. రేపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమయ్యే కౌటింగ్‌కు అన్నీ ఏర్పాట్లు పూర్త చేశారు అధికారులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి సంబంధించిన 13 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్లను 14 రౌండ్లలో లెక్కింపు పూర్తి చేసి ఫలితాలను ప్రకటించనున్నారు. కౌటింగ్ కేంద్రం వద్ద మూడంచెలతో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇంకా కొన్ని గంటల్లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రక్రియ మొదలుకానున్న సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కౌంటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లపై స్ట్రాంగ్ రూమ్ ల నుంచి మా కరస్పాండెంట్ సత్యనారాయణ తాజా సమాచారం అందిస్తారు