తెలుగుదేశం, జనసేన కూటములు అధికారంలోకి వస్తే వైసిపి ప్రభుత్వం నాలుగున్నర ఏళ్లలో విపక్షాలపై పెట్టిన అక్రమ కేసులన్నింటిని ఎత్తివేస్తూ చంద్రబాబు నాయుడు మొదటి సంతకం చేస్తారని ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం టిడిపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసిపి చేస్తున్నది బీసీ యాత్ర కాదని, బేవర్స్ బస్సు యాత్రని, మంత్రులు, కార్పొరేషన్లు చైర్మన్ చైర్మన్ ల తో బస్సులు ఫుల్ అవుతునయే తప్ప సభలకు జనం మాత్రం నిల్ అంటూ ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ చంద్రబాబు నాయుడు గేట్లు ఎత్తితే వైసిపి ఖాళీ అవుతుందని, అయితే పార్టీ లోకి కొత్తవారిని చేర్చుకునే విషయంలో అధినేత ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు వెంకన్న చెప్పారు. క్వాలిటీ ఉన్న నాయకులను మాత్రమే పార్టీలో చేర్చుకుంటామని, ఇప్పుడు వరకు చూసిన చంద్రబాబు ఒక ఎత్తు అయితే 2024 నుంచి ప్రజలు కొత్త చంద్రబాబును చూస్తారని వెంకన్న చెప్పారు . సోమవారం నారా లోకేష్ కోనసీమ జిల్లా రాజోలు నుంచి ప్రారంభించే యాత్రలో జనసేన కూడా పాల్గొంటుందన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై పెద్దగా ఉండకపోవచ్చు అయితే చంద్రబాబు మళ్లీ జనములోకొస్తే రాష్ట్రం జన సందోహంతో మరో సునామి అవడం ఖాయమన్నారు.
బస్సులు ఫుల్ అవుతున్నాయే తప్ప సభకు జనం మాత్రం నిల్..
78
previous post