ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఆదివారం రేపు జరిగే సామాజిక సాధికారిక యాత్రకు సర్వం సిద్దం చేసినట్లు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మీడియా సమావేశంలో తెలిపారు. స్థానిక వైయస్సార్ సిపి కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గం వ్యాప్తంగా సుమారు 25 వేల మంది వైయస్సార్ సిపి నాయకులు కార్యకర్తలు బస్సు యాత్రలో పాల్గొంటారని తెలిపారు. యాత్రకు సంబంధించి ఇప్పటికే నియోజకవర్గం లో ని ప్రతి గ్రామం నుంచి భారీ బస్సు యాత్రకు తరలిరాన్నుట్లు తెలిపారు. బస్సు యాత్ర అనంతరం గాంధీ సెంటర్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ బహిరంగ సభకు అనేక మంది మంత్రులు, విడుదల రజిని మెరుగ నాగార్జున శాసన సభ్యులు,శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులతో పాటు అన్ని రకాల కార్పొరేషన్ లో ఛైర్మన్ లు పాల్గొంటారని తెలిపారు. ఈ బహిరంగ సభలో గత నాలుగున్నర సంవత్సరాలో వైయస్సార్ సిపి ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచిని వివరించనున్నట్లు తెలిపారు. అలాగే మళ్ళీ తిరిగి నందిగామ నియోజకవర్గంలో డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గెలుపుకు నాంది పలుకుతుందని తెలిపారు.
ysrcp bus yatra
తెలుగుదేశం, జనసేన కూటములు అధికారంలోకి వస్తే వైసిపి ప్రభుత్వం నాలుగున్నర ఏళ్లలో విపక్షాలపై పెట్టిన అక్రమ కేసులన్నింటిని ఎత్తివేస్తూ చంద్రబాబు నాయుడు మొదటి సంతకం చేస్తారని ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం టిడిపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసిపి చేస్తున్నది బీసీ యాత్ర కాదని, బేవర్స్ బస్సు యాత్రని, మంత్రులు, కార్పొరేషన్లు చైర్మన్ చైర్మన్ ల తో బస్సులు ఫుల్ అవుతునయే తప్ప సభలకు జనం మాత్రం నిల్ అంటూ ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ చంద్రబాబు నాయుడు గేట్లు ఎత్తితే వైసిపి ఖాళీ అవుతుందని, అయితే పార్టీ లోకి కొత్తవారిని చేర్చుకునే విషయంలో అధినేత ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు వెంకన్న చెప్పారు. క్వాలిటీ ఉన్న నాయకులను మాత్రమే పార్టీలో చేర్చుకుంటామని, ఇప్పుడు వరకు చూసిన చంద్రబాబు ఒక ఎత్తు అయితే 2024 నుంచి ప్రజలు కొత్త చంద్రబాబును చూస్తారని వెంకన్న చెప్పారు . సోమవారం నారా లోకేష్ కోనసీమ జిల్లా రాజోలు నుంచి ప్రారంభించే యాత్రలో జనసేన కూడా పాల్గొంటుందన్నారు. తెలంగాణ ఎన్నికల ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై పెద్దగా ఉండకపోవచ్చు అయితే చంద్రబాబు మళ్లీ జనములోకొస్తే రాష్ట్రం జన సందోహంతో మరో సునామి అవడం ఖాయమన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బిసి లకు అన్యాయం చేసిన వైసిపి వినుకొండలో బస్సు యాత్ర చేయడం బాధకారమన్నారు. స్ధానిక తెలుగుదేశం పార్టీ కార్యలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జివి ఆంజనేయులు మాట్లాడుతూ వినుకొండలో జరిగిన బస్సు యాత్ర జనాభా లేక విఫలమైందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, సబ్ ప్లాన్ నిధులు మంజూరు చేయకుండా బస్సు యాత్ర చేసే మంత్రులు ఏం సమాధానం చెప్తారో తెలపాలన్నారు. రాష్ట్రంలో ఇన్ని కార్పొరేషన్ లు ఏర్పాటు చేసి ఏ ఒక్క కార్పొరేషన్ కన్నా నిధులు మంజూరు చేశారా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి నిరంకుశ ధోరణి వలన మంత్రులు కూడా కార్పొరేషన్ నిధులు అడగలేని దుస్థితి ఈ రాష్ట్రంలో నెలకొందని తెలిపారు. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు, ప్రజలకు రేషన్ అందజేసి ప్రజలకు లక్షల కోట్లలో డబ్బులు జమ చేశామని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. ఆక్రమ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి జైలులో పెట్టారని,
జగన్మోహన్ రెడ్డి ఎన్ని వ్యవస్థలు మేనేజ్ చేసి 10 సంవత్సరాల నుండి బయట తిరుగుతున్నారని తెలిపారు. వరికపూడిశెల ప్రాజెక్టు నాలుగున్నర సంవత్సరాలుగా పట్టించుకోకుండా ఇప్పుడు శంకుస్థాపన చేస్తామని చెప్పడం సిగ్గు చేటన్నారు.
ఆమదాలవలస వైఎస్ఆర్ జంక్షన్ చేరుకున్న సామాజిక సాదికార బస్సు యాత్ర.. వైఎస్సార్ కూడలి నుండి బైక్ ర్యాలీ.. వైస్సార్ విగ్రహానికి జోనల్ ఇంచార్జ్ వైవి సుబ్బారెడ్డి, స్పీకర్ సీతారాం, మంత్రి సీదిరి అప్పల రాజు పూలమాలలు వేసి నివాలులు అర్పించారు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. మరి కాసేపట్లో సామాజిక సాధికార బస్సుయాత్ర బహిరంగ సభ ఆమదాలవలస లో ప్రారంభం కానున్నారు.
దర్మాన క్రిష్ణ దాస్… మాజీ ఉప ముఖ్యమంత్రి, వైసిపి జిల్లా అద్యక్షులు 139 కులాలకు 59 కార్పోరేషన్ లు ఏర్పాటు చేసారు. జిల్లాలో రెండవ విడత సాధికార బస్సుయాత్ర నిర్వహిస్తున్నాం. బస్సు యాత్రకు ప్రజలు బహ్మరథం పడుతున్నారు. అన్ని వర్గాల వారికి సామాజిక న్యాయం చేసాం. పాదయాత్ర గుర్తించిన ప్రతీ సమస్యకు పరిష్కారం చూపిస్తున్నారు. విద్యా, వైద్యం కు ప్రదమ ప్రాధాన్యత నిచ్చారు.. దేశంలోనే అత్యుత్తమ విద్యా వ్యవస్థ ను నెలకొల్పుతున్నారు.. ఆర్బీకే లతో రైతులకు అన్ని విశాల సహాయ సహకారాలు అందజేస్తున్నాం. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం తో అనేక ప్రాజెక్ట్ లు వెనక బడ్డాయి. టెక్కలి లో మూడు వేల కోట్లతో పోర్టు నిర్మాణం సాగుతోంది. వాటర్ గ్రిడ్ ద్వారా ఉద్దానం కిడ్ని సమస్యకు పరిష్కారం చూపుతున్నాం. కిడ్నీ రిసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. 4 ఏళ్లలో అనేక విప్లవాత్మక మార్పులు చెపట్టాం. వచ్చేది వైఏస్ జగన్ ప్రభుత్వమే. సర్వేలన్నీ మరలా జగన్ నే నెక్స్ట్ సిఏం అని చెపుతున్నాయి..
సామాజిక సాధికారక బస్సు యాత్రను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి చిత్తూరు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిప్యూటీ సీఎం లు అంజద్ భాష , నారాయణస్వామి, బిసి శాఖ మంత్రి వేణుగోపాల్, బీద మస్తాన్ రావు వంటి పలువురు మంత్రులు ఎమ్మెల్సీలు ఎంపీలు కార్యక్రమానికి హాజరై సాధికార యాత్ర విజయవంతం చేశారని ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
సామాజికంగా వెనుకబడిన వర్గాలను ముందుండి నడిపిస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష అన్నారు. గతంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను ఓట్ బ్యాంకుగా వాడుకొని వదిలేసేవారని అన్నారు. ఉదయగిరి పట్టణంలో వైసీపీ నేత మేకపాటి రాజగోపాల్ అధ్యక్షతన జరిగిన సామాజిక సాధికార బస్సుయాత్ర బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష మాట్లాడారు. తొలుత పంచాయతీ బస్టాండ్ సెంటర్ నుంచి ర్యాలీగా బహిరంగ సభ చేరుకున్నారు. సభలో మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ రాబోవు ఎన్నికలలో ప్రతిపక్షాలు అడ్డొచ్చినా ముందుకు సాగుతామన్నారు. ర్యాలీలో భారీగా పాల్గొన్న కార్యకర్తలు, ప్రజలు సభ మధ్యలేనే వెళ్లిపోవటంతో సభ వెలవెలబోయింది.
బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చందోలు బగళముఖి ఆలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి, శాసనమండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, ఎంఎల్సి పోతుల సునీత, ఎంఎల్ఏ కోన రఘుపతి ఈ ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.