ఎంతో ఉత్కంఠను రేకెత్తించిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగిసింది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల తలరాతలు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నాయి. మరోవైపు ఏ పార్టీ గెలవబోతోందనే విషయంలపై పలు ఎగ్జిట్ పోల్స్ వాటి అంచనాలను వెల్లడించాయి. మరోవైపు గత తెలంగాణ ఎన్నికల సమయంలో ఇండియా టీవీ – సీఎన్ఎక్స్ వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి. 2018లో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ఈ సర్వే అప్పట్లో వెల్లడించింది.
బీఆర్ఎస్ కు 62 నుంచి 70 సీట్లు వస్తాయని అప్పట్లో ఇండియా టీవీ – సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. చెప్పినట్టుగానే బీఆర్ఎస్ అధికారాన్ని కైవసం చేసుకుంది. 88 స్థానాల్లో గెలుపొంది మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుందని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఇండియా టీవీ – సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ 63 నుంచి 79 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసింది. బీఆర్ఎస్ 31 నుంచి 47 స్థానాలకే పరిమితమవుతుందని తెలిపింది. ఈ అంచనాలు ఎంత వరకు నిజమవుతాయో వేచి చూడాలి.
తెలంగాణ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు..
79
previous post