పెసలు ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఉపయోగపడతాయి. అనేక సౌందర్య సాధనాల్లో పచ్చ పెసలను వాడతారు. వీటితో ఇంట్లోనే మంచి మంచి ఫేస్ ప్యాక్‌లు వేసుకోవచ్చు. వీటి వల్ల మృదవైన, మెరిసే ముఖాన్ని పొందవచ్చు. ఇప్పుడు చెప్పుకోబోయే ఫేస్ ప్యాక్‌లు ఫాలో అయితే పొడిచర్మం, మొటిమలు, ఫేస్ మీద టాన్ ఇలాంటివేవీ ఉండవు. మొటిమలకు- మొటిమలు విరిగి చికాకు అనిపిస్తే, మొటిమలు వ్యాప్తి చెందడానికి కారణమైతే పచ్చి పెసలను రాత్రంతా పాలలో నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం గ్రైండ్ చేసి దానిపై ఒక చెంచా నెయ్యి పోసి ముఖానికి మర్దన చేయాలి. 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే ముఖం మొటిమలు లేకుండా మారుతుంది. వడదెబ్బ నుంచి బయటపడేందుకు పచ్చి పెసలు రాత్రంతా నానబెట్టి, మరుసటి రోజు మెత్తగా నూరి, చల్లటి పెరుగు, కీరదోసకాయ కలిపి ముఖానికి పట్టించి 10 నిమిషాలు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల ముఖం తెల్లగా మృదువుగా మారుతుంది. ఫేస్ ప్యాక్- ఒక గుప్పెడు పచ్చి పెసల్లో పాలు పోసి రాత్రంతా నానబెట్టి, మరుసటి రోజు ఉదయం మెత్తగా రుబ్బుకుని, ముఖం, మెడ, చేతులకు అప్లై చేసి 15-20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేయడానికి ముఖాన్ని పొడిగా ఉంచుకోవాలి. దీంతో మృదువైన, మెరిసే ముఖాన్ని పొందవచ్చు వెంట్రుకలు పెరగడం పచ్చి పెసరపిండిని మెత్తగా రుబ్బుకోవాలి. గుడ్డులోని తెల్లసొన, పెరుగు, నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసి తలకు పట్టించండి. 15 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా పచ్చిపెసలను మీకు కావాల్సినట్లు వాడుకోవచ్చు. వీటివల్ల ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అటు ఆరోగ్యానికి, ఇటు ముఖ సౌందర్యానికి పెసలు అద్భుతంగా పనిచేస్తాయి.
ముఖానికి పెసలతో ప్యాక్.. మొటిమలు మాయం.. పొడి చర్మం పరార్..!
70
previous post