76
అనంతపురం జిల్లా గుత్తి మండలం జక్కలచెరువు గ్రామ సమీపంలో 63వ జాతీయ రహదారిపై బైకు అదుపుతప్పి బోల్తా పడడంతో గొందిపల్లి గ్రామానికి చెందిన ఓబుల్ రెడ్డి అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఇతన్ని స్థానికులు గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు.