123
ఫ్యాక్టరీ వద్దు..మా పొలాలు మాకే కావాలంటూ చిత్తూరు జిల్లా పలమనేరు మండలం రెవెన్యూ డివిజనల్ కార్యాలయం వద్ద గోపిశెట్టిపల్లి రైతులు సుమారు 150 మంది ధర్నానిర్వహించారు. గ్రామస్తులు మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో తరచూ పేపర్లలో మా గోపిశెట్టి పల్లి గ్రామానికి చెందిన వందలాది ఎకరాల్లో ఫ్యాక్టరీని నిర్మిస్తున్నట్లు ప్రకటనలు వచ్చాయని, తమకు అధికారులు ఎవరు ఈ విషయమై అధికారికంగా ప్రస్తావన తీసుకురాలేదన్నారు. ఎన్నో దశాబ్దాలుగా తాత ముత్తాతల నుండి ఆ భూముల్లో సాగు చేసుకుంటున్నామని. భూములు వదులుకోవడానికి మేము సిద్ధంగా లేమన్నారు. అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా వెనుకాడబోమన్నారు..ఆర్డీవో అందుబాటులో లేకపోవడంతో రైతులు సిబ్బందికి వినతి పత్రం అందించారు.