78
సోంపేట మండలం బారువ పెట్రోల్ బంక్ కు కూత వేటు దూరంలో ఓ కారు అదుపుతప్పి వరద కాలువలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో సోంపేట మండలం గొల్లవూరు గ్రామానికి చెందిన మృత్యుంజయ (38) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. మందస మండలం సిద్దిగాం గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ సాయికుమార్ తీవ్ర గాయాలు పాలయ్యాడు. కారు ముందు సీట్లో కూర్చున్న సురేంద్ర, చక్రి ఇద్దరు యువకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు వాహనంలో బారువ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై బారువ ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.