సింగిల్ థియేటర్ల పర్సంటేజ్ వివాదం..

సింగిల్ థియేటర్ల పర్సంటేజ్ వివాదం

Advertisements

<p>ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను టాలీవుడ్ అగ్ర నిర్మాతలు రాజమహేంద్రవరంలోని షెల్టన్ హోటల్‌లో అత్యవసరంగా కలుసుకున్నారు&period; తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం సినిమా పరిశ్రమను వేధిస్తున్న &OpenCurlyQuote;సింగిల్ థియేటర్ల పర్సంటేజ్ వివాదం’&comma; ఎగ్జిబిటర్ల సమస్యలపై ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చించారు&period; థియేటర్ల నిర్వహణ వ్యయం&comma; నెలవారీ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని నిర్మాతలు పవన్ దృష్టికి తీసుకెళ్లారు&period; థియేటర్ల యజమానులపై భారం తగ్గించేందుకు విద్యుత్ ఛార్జీల్లో రాయితీ ఇచ్చేలా ప్రభుత్వ పరంగా నిర్దిష్టమైన పాలసీని రూపొందించాలని కోరారు&period; మల్టీఫ్లెక్స్‌à°² తరహాలోనే సింగిల్ స్క్రీన్స్‌లోనూ వచ్చిన లాభాల్లో ప్రొడ్యూసర్స్ నుంచి పర్సంటేజీ విధానాన్ని అమలు చేస్తేనే థియేటర్లు నిలదొక్కుకుంటాయని విజ్ఞప్తి చేశారు&period; ఈ భేటీలో ప్రముఖ నిర్మాతలు నాగవంశీ&comma; వై&period; రవిశంకర్&comma; సాహు గారపాటి&comma; కిలారి సతీష్ తదితరులు పాల్గొన్నారు&period;నిర్మాతలు వివరించిన సమస్యలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది&period; సినీ రంగ సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు&period; ప్రొడ్యూసర్ల ప్రతిపాదనలను తక్షణమే పరిశీలించాల్సిందిగా రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్‌కు పవన్ సూచించినట్లు సమాచారం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..